షట్సంపత్తి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
షట్సంపత్తి అనగా ఆరు సంపత్తులు.
శమము
మార్చు- "విషయాల మిధ్యాత్వాన్ని, అనిత్యతను మళ్ళి మళ్ళి గుర్తించి విరక్తమయిన మనసు, సదా శాంతంగా లక్ష్యం వైపు నియమితమయి ఉండడమే శమం అనబడుతుంది."
దమము
మార్చు- "కర్మేంద్రియాలనూ జ్ఞానేంద్రియాలనూ వాటికి సంబంధించిన భోగవస్తువుల ఆకర్షణ నుండి సదా మళ్ళించి నియమిస్తూ ఉండడమే దమము అనబడుతుంది."
తితిక్ష
మార్చు- "దుఃఖానుభవాలను, బాధలను, తప్పించుకోవాలనే కోరికకూడా లేకుండా ప్రతీకార వాంఛ లేకుండా శాంతంగా సహనంతో అనుభవించడాన్ని తితిక్ష అంటారు."
ఉపరతి
మార్చు- "బాహ్యంగా వస్తువులున్నప్పటికీ ఇంద్రియాలలో సంచలనం గలగకుండా ఉండడమే ఉపరతి అనబడుతుంది."
శ్రద్ధ
మార్చు- "శాస్త్రపు వాచ్య, లక్ష్యార్ధాలనూ, గురు వాక్యాలనూ యధాతధంగా అర్ధంచేసుకోగల, వివేక విజ్ఞాన పూరిత ప్రశాంత మనఃస్థితి శ్రద్ధ అనబడుతుంది. ఈ శ్రద్ధ వలన మాత్రమే సత్యదర్శనం సంభవమవుతుంది."
సమాధి
మార్చు- "సునిశితమూ, తీక్షణమూ వివేక విజ్ఞాన పూరితమూ అయిన బుద్దికి కూడా అందడానికి వీలులేని పరమ సత్యాన్ని సదా సమగ్రంగా, ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండే మనసు సమాధిలో ఉందని అంటారు."