షష్ఠి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఆరవ తిథి షష్ఠి. అధి దేవత - కుమార స్వామి. ఒక మాసంలో రెండుసార్లు వస్తుంది. అవి బహుళ షష్ఠి, శుక్ల షష్ఠి. బహుళ షష్ఠి ఒక మాసంలో ఆరవ రోజు వస్తే, శుక్ల షష్ఠి 21వ రోజున వస్తుంది. షష్ఠి అనే పదం సంస్కృత సంఖ్యామానం నుండి వ్యుత్పత్తి అయినది. సంస్కృత భాషలో దీని అర్థం "ఆరు". శుక్లపక్షంలో వచ్చే ఈ తిథి రోజున అనేక పండుగలను జరుపుకుంటారు.
- దుర్గా పూజ (సెప్టెంబరు - అక్టోబరు, తూర్పు భారతదేశం, బెంగాల్)
- శీతల్‌సతి[1] (మే - జూన్, ఒడిశా, పరిసర ప్రాంతాలు)
- స్కంద షష్ఠి లేదా సుభ్రహ్మణ్య షష్ఠి[2] (నవంబరు - డిసెంబరు; దక్షిణ భారతదేశం, తమిళనాడు)
- ఛాత్, హిందూ మతంలో సూర్యుని ఆధాధించే ముఖ్యమైన రోజు, దీనిని కార్తీక మాసం శుక్ల పక్షంలోని 6 వరోఝున జరుపుతారు.
సుబ్రహ్మణ్య షష్ఠి సవరించు
సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. [3]
మూలాలు సవరించు
- ↑ "Festivals of India : Sital Shashti". Aryabhatt.com. Retrieved 2017-07-29.
- ↑ Kannikeswaran, Kanniks. "Skanda Sashti". Indiantemples.com. Retrieved 29 July 2017.
- ↑ పండుగలు - పరమార్థములు (రచయిత ఆండ్రశేషగిరిరావు), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి