షాడోగ్రఫీ
షాడోగ్రఫీ లేదా ఓంబ్రొమనీ చేతి నీడలతో వివిధ రకాల ఆకారాలు సృష్టించే ఒక కళ. దీనినే నీడల సినిమా అని కూడా వ్యవహరిస్తారు. ఈ కళని ప్రదర్శించేవారిని షాడోగ్రఫిస్ట్ లేదా షాడోగ్రాఫర్ అని అంటారు.
19వ శతాబ్దము నుండి ఈ కళ కనుమరుగైనది. విద్యుద్దీపాలు అందుబాటులోకి రావటంతో ఇళ్ళల్లో ఇతర దీపాలు వాడే అవసరం లేకపోయింది. విద్యుద్దీపాలతో నీడ సరిగా ఏర్పడదు. అదే కొవ్వొత్తుల వెలుగులో చేతి నీడ చక్కగా ఏర్పడుతుంది. అందుకే ఈ కళకు పూర్వం మంచి ప్రాచుర్యం గలదు.
షాడోగ్రఫీ కి ఫ్రెంచి కళాకారుడు ఫెలిషియన్ ట్రెవీ క్రొత్త సొబగులని అద్దాడు. ప్రముఖ వ్యక్తుల ముఖాలని నీడలతో ఆవిష్కరించాడు.
పుట్టుక
మార్చుదీపాలు, వెలుతురు, వాటికి అడ్డు వచ్చి నీడలని సృష్టించే వస్తువులు శతాబ్దాల వెనుక నుండి ఉన్నవే కాబట్టి ఈ కళ ఎప్పుడు పుట్టిందో నిర్దిష్టంగా చెప్పటం కష్టం. కానీ ఇది తూర్పు భూగోళంలోనే ఆవిర్భవించినదని చెప్పవచ్చును. ఫ్రెంచి లో ఓంబ్రెస్ షినోయ్సెస్ (అనగా చైనీయుల నీడలు) అని పిలువబడే చైనీయుల తోలు బొమ్మలాటల పై ఆసక్తి పెంచుకొన్న ఫెలిషియన్ ఈ కళని ఐరోపా దేశాలకి పరిచయం చేసాడు. 19వ శతాబ్దంలో ఇది అక్కడా చాలా ప్రాచుర్యము పొందినది.
ఉనికి
మార్చుఒక మెజీషియన్ ఈ కళను కనుక్కొనటంతో ఇతర మెజీషియన్లు కూడా ప్రేరణ పొందడం వలన, వేర్వేరు రంగాలలో ఉన్న కళాకారులు షాడోగ్రఫీని ప్రదర్శించిననూ, దీనిని ఎక్కువగా మెజీషియన్లు ప్రదర్శించటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఆదరణ తేవడంలో కీలక పాత్రని పోషించిన ఫెలీషియన్ ఏనుగు, పక్షి, పిల్లి, ల ఆకారాలను చక్కగా చూపడంతో బాటు, తాను కొన్ని ఆకారాలని కనుగొన్నాడు. 1889 లో అలెగ్జాండర్ హర్మన్, అలెగ్జాండర్ నుండి డేవిడ్ టోబియాస్ బ్యాంబర్గ్ కి, డేవిడ్ నుండి అతని కుమారుడు టోబియాస్ లీండర్ట్ బ్యాంబర్గ్, టోబియాస్ తన కుమారుడు డేవిడ్ థియోడెర్ బ్యాంబర్గ్ కి వ్యాపింపజేసారు.
షాడోగ్రఫీ లేదా ఆంబ్రమనీ అనగా చేతుల నీడలని బొమ్మల వలె ఏర్పడేలా చేయటం లేదా అలా ఏర్పడిన బొమ్మలతో కథ చెప్పటం. అందుకే దీనిని సినిమా ఇన్ సిల్హౌట్ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కళని ప్రదర్శించేవారిని షాడోగ్రఫిస్ట్, లేదా షాడోగ్రఫర్ అని అంటారు.
19వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చిన విద్యుచ్ఛక్తి తో ఈ కళ మరుగున పడినది. ఇళ్ళలో వాడే బల్బులు ఈ కళకి కావలసిన విధమైన నీడలని ఇవ్వవు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు, టెలివిజన్ వంటి వినోద సాధనాలు కూడా ఇందుకు ఒక కారణం. కొవ్వొత్తుల వెలుతురులో ఏర్పడే చేతి నీడలు అది వరకు చక్కని ఆకృతులలో రావటం వలన అప్పట్లో ఈ కళ సర్వసాధారణంగా ఉండేది.
ఫ్రెంచి దేశస్థుడైన ఫెలిషియన్ ట్రెవే 19వ శతాబ్దంలో ఈ కళని జనాదరణకి నోచుకొనేలా చేశాడు. [1] ప్రముఖ వ్యక్తుల ముఖాల వలె ప్రతిబింబాలను సృష్టించటంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
పుట్టుక
మార్చునీడ అన్నది కాంతి పుట్టినపుడే పుట్టటంతో ఈ కళ ఎప్పుడు ఆవిర్భవించినదో చెప్పటం కష్టం. ఆది మానవులు దీనిని అభ్యసించిననూ సుదూర తూర్పులో ఉద్భవించి ఉండవచ్చును. [2] ఫెలిషియన్ ట్రెవే చైనీయుల తోలుబొమ్మలాట అయిన ఓంబ్రెస్ చినోయ్సిస్ (Chinoises), అనగా "Chinese shadows" అనే కళ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఫెలిషియన్ చొరవతో ఈ కళ ఐరోపా ఖండంలో 19వ శతాబ్దంలో విస్తరించినది.
ప్రాబల్యం
మార్చువివిధ కళాకారులు ఈ కళని ప్రదర్శించిననూ, ఎక్కువగా దీనిని ఇంద్రజాలికులే ప్రదర్శిస్తూ ఉంటారు. బహుశా ఒక ఇంద్రజాలికుడు ఈ కళని ప్రదర్శించి ఇతర ఇంద్రజాలికులకి ప్రేరణగా నిలిచిన కారణం అయ్యి ఉండవచ్చును.[3] ఏనుగు, పక్షి, పిల్లుల ప్రతిబింబాలని సృష్టించటంలో ఫెలిషియెన్ సిద్ధహస్తుడు. [4] తాను స్వంతంగా కూడా ఫెలిషియెన్ కొన్ని ప్రతిబింబాలు సృష్టించాడు (స్వచ్ఛంద సేవకుడు, రాబిన్సన్ క్రూజో, గుర్రపు రౌతు, The Rope Dancer వంటివి.[5] ఫెలిషియన్ 1889 లో అలెగ్జాండర్ హెర్మన్ కి ఈ విద్యని నేర్పించాడు. అలెగ్జాండర్ డేవిడ్ టోబియాస్ బ్యాంబర్గ్ కి నేర్పించగా, డేవిడ్ తన తనయుడు ఒకిటో (టోబియాస్ లీండర్ట్ బ్యాంబర్గ్) కి నేర్పించాడు. ఒకిటో తన కుమారుడైన ఫు మంచు (డేవిడ్ థియోడెర్ బ్యాంబర్గ్) కి నేర్పించాడు. తన సంతానమెవరూ ఇంద్రజాలం వైపు రాకపోవటంతో ఫు మంచు మార్సెలో కాంటెంటో అనే తన శిష్యుడికి నేర్పించాడు. మార్సెలో ఈ విద్యతో ప్రపంచ ఖ్యాతిని గాంచాడు. తన చేతులని తప్పితే మరే ఇతర పరికరాన్ని వాడని మార్సెలో నే పరిణతి చెందిన షాడోగ్రఫర్ గా పేరొందాడు. అయితే తన సంతానానికి గానీ, ఇతరులకి గానీ నేర్పక ముందే మార్సెలో మరణానికి గురయ్యాడు.
షాడోగ్రఫీ ని అభినయించే ఇతర ఇంద్రజాలికులు:
- డేవిడ్ డివాంట్
- ఎడ్వార్డ్ విక్టర్
- హోల్డెన్ & గ్రాహం (ద్వయం). "Monkey in the Belfry" అనే నీడకు వీరు ప్రసిద్ధి.[3]
ఆస్ట్రేలియా కి చెందిన రేమండ్ క్రోవె అనే ఇంద్రజాలికుడు వాట్ ఎ వండర్ ఫుల్ వరల్డ్ అనే లూయిస్ ఆర్ంస్ట్రాంగ్ పాటకి చేసిన షాడోగ్రఫీ, యూట్యూబ్ లో చాలా పేరొందినది.[ఆధారం చూపాలి].
పనిముట్లు
మార్చుచేతులు
మార్చుచేతులని, వ్రేళ్ళని వివిధ పద్ధతులలో అమర్చటం ద్వారా నీడలో అవి కావలసిన ఆకృతిని సంతరించుకొంటాయి.
కాంతి మూలం
మార్చుప్రకాశవంతంగా, చిన్నగా ఉండే కాంతి మూలం అవసరం అవుతుంది. ఇది ఎంత చిన్నగా ఉంటే నీడలు అంత చక్కగా ఏర్పడతాయి.[6] ఆల్బర్ట్ అల్మోజ్నినో ఒక కొవ్వొత్తిని గానీ, కటకం, రిఫ్లెక్టర్ తీసివేయబడిన ఒక ఫ్ల్యాష్ లైట్ ని గానీ మరే ఇతర చిన్న కాంతి మూలాన్ని గానీ వాడమని సూచిస్తాడు. బల్బుని వాడినచో కాంతి స్పష్టంగా ఉండాలని, ఈ కళకి అత్యుత్తమ కాంతి మూలం ఎలెక్ట్రిక్ ఆర్క్ అనీ జె. సి. క్యానెల్, తను రచించిన మాడర్న్ కంజ్యూరింగ్ ఫర్ అమెచ్యూర్స్ అనే పుస్తకంలో తెలిపాడు. దీనితో అల్మొజ్నినో ఏకీభవిస్తారు. దీనికి ప్రత్యాన్మాయముగా లైం లైట్ ని వాడవచ్చునంటారు. అయితే ట్రెవీ లైం లైట్ బూడిద రంగు చారలని చూపుతుందని సూచిస్తారు. ఇవి కాకుండా అసిటిలిన్ గ్యాస్ ల్యాంప్ (కార్బైడ్ ల్యాంప్) లని కూడా షాడోగ్రఫిస్టులు విరివిగా వాడినట్లు తెలిపారు. [7]
తెర
మార్చుచిన్న పాటి ప్రేక్షక వర్గం అయితే ఒక తెల్లని రంగు లేదా ఏదైన లేత రంగు గల గోడని గానీ, వస్త్రాన్ని గానీ లేదా టేబుల్ క్లాత్ ని గానీ వాడమని అల్మొజ్నినో సూచిస్తారు. ప్రేక్షక వర్గం ఎక్కువగా (ఆడిటోరియం, స్టేజ్) ఉన్నట్లయితే ముస్లిన్ తో చేసిన తెరని వాడమని సూచిస్తారు. నైట్ క్లబ్బులలో అయితే నైలాన్ తెరని వాడమని సూచిస్తారు. [2]
హెర్మన్ మార్సెలో
ప్రదర్శన
మార్చుప్రదర్శనకారుడు కాంతి మూలం, తెరల మధ్యన ఉండి కళని ప్రదర్శిస్తాడు. అయితే తెర వెనుక అయినా లేదా ముందు ఉండి ప్రదర్శించవచ్చును. రెండింటికీ వాటి వాటి లాభాలు గలవు. కాంతి మూలానికి కుడి, లేదా ఎడమ వైపుల ఉండి ప్రదర్శించటం లో కూడా వాటి వాటి లాభాలు గలవు. కాంతి మూలం వద్ద నుండి దూరం పెరుగుతున్న కొలదీ నీడ పరిమాణం తగ్గుతూ వస్తుంది. తెరకి చేతులు దగ్గరయ్యే కొద్దీ నీడలలో స్పష్టత వస్తుంది. ట్రెవీ ప్రకారం కాంతి మూలం నుండి చేతులు నాలుగు అడుగులు, చేతుల నుండి తెర వద్దకి ఆరు అడుగులు అతి సౌకర్యవంతమైన దురాలు. చేతుల కంటే నీడలని గమనించటమే కళాకారుడి ప్రాథమిక దృష్టిని కేంద్రీకరించాలి.
నీడల లో చలనాలు కలిగించటంతో వాటిలో జీవం ఉన్న భ్రాంతి కలుగుతుంది. మరికొన్ని పనిముట్లతో ఎక్కువ ఆకృతులని సృష్టించవచ్చును. -->
సుప్రసిద్ధ షాడోగ్రఫర్ లు
మార్చు- Albert Almoznino
- Amar Sen
- Bablu Mallick
- David Bamberg
- Drew Colby
- Félicien Trewey
- Henry Bursill
- Marcelo Contento
- Max Holden
- Philippe Beau
- Prahlad Acharya
- Raymond Crowe
- Sati Achath
- Gali Krishna(IIT Bhubaneswar)
- Sabyasachi Sen
- Tobias Bamberg
- Arturo Brachetti
పుస్తకాలు
మార్చు- Hand Shadows to be Thrown Upon the Wall by Henry Bursill (1859)
- Hand Shadows - Second Series by Henry Bursill (1860)
- Home Fun by Cecil H. Bullivant (1910)--contains a chapter on Hand Shadows
- The Art of Shadowgraphy - How it is Done by Trewey (1920)
- Hand Shadows: The Complete Art of Shadowgraphy by Lois Nikola (1921)
- The Art of Hand Shadows by Albert Almoznino (1970)
- Shadow Tails by Drew Colby (2011)
మూలాలు
మార్చు- ↑ "Quick Change Artistry". Archived from the original on 2013-05-22. Retrieved 2013-05-01.
- ↑ 2.0 2.1 The Art of Hand Shadows by Albert Almoznino
- ↑ 3.0 3.1 Shadowgraphy - MagicPedia
- ↑ The art of shadowgraphy; how it is done
- ↑ The art of shadowgraphy; how it is done
- ↑ Modern Conjuring for Amateurs - Google Books
- ↑ Modern Conjuring for Amateurs - Google Books
బాహ్య లంకెలు
మార్చు- FingerandThumbTheatre.com
- Handshadowgraphy.com
- HansDavis.com
- PhilippeBeau.com
- RaymondCrowe.com
- AmarSen.com
- The Art of Shadowgraphy: How it is Done by Trewey online book
- Modern Conjuring For Amateurs by J. C. Cannell page 234 (Hand Shadows) online book
- The Art of Hand Shadows by Albert Almoznino online book
- Hand Shadows to Be Thrown Upon The Wall by Henry Bursill
- Breakthrough example of Handshadowgraphy
- Marcelo Contento Magicpedia