షాహ్ నామా
షానామా లేక షాహ్ నామా లేక షాహ్‌నామెహ్ ( ఫార్సీ: شاهنامه pronounced [ʃɒːhnɒːˈme] ; అనువాదం: "రాజుల పుస్తకం" ) [a] పర్షియన్ కవి ఫిరదౌసి సా.శ. 977 నుండి 1010 వరకు రాసిన సుదీర్ఘ ఇతిహాసం. ఇది గ్రేటర్ ఇరాన్ అని పిలిచే విస్తారమైన సాంస్కృతిక ప్రదేశానికి జాతీయ ఇతిహాసం. డిస్టిచ్‌లు అని పిలిచే ద్విపదల్లో (రెండు పాదాల పద్యం) ఈ ఇతిహాసం కూర్చబడింది. దాదాపు 50 వేల డిస్టిచ్‌లు కలిగివున్న ఈ షాహ్‌నామా సుమారు 50,000 " డిస్టిచ్లు " లేదా ద్విపదలు (రెండు-లైన్ పద్యాలు) కలిగి ప్రపంచంలో. అత్యంత సుదీర్ఘమైన ఇతిహాస కావ్యాల్లో ఒకటిగా నిలిచింది.[2] ఇది ప్రధానంగా మిథికల్ లేక పౌరాణిక సాహిత్యం, ఐతే దీనిలో కొంతవరకూ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఇస్లామీయ దండయాత్ర, విజయం వరకూ పర్షియన్ సామ్రాజ్యపు చరిత్ర పొందుపరిచాడు కవి. పర్షియన్ సంస్కృతి ప్రభావం కలిగిన ఇరాన్, అజర్‌బైజాన్, ఆఫ్ఘనిస్తాన్, జార్జియా, అర్మేనియా, టర్కీ, డాగేస్టాన్ దేశాలు కలిగిన విస్తారమైన ప్రాంతం దీన్ని జాతీయ ఇతిహాసంగా ప్రస్తుతిస్తుంది.
రాజుల పుస్తకం | |
by ఫిరదౌసి | |
వాస్తవ శీర్షిక | شاهنامه |
---|---|
రాసినవారు | 977–1010 CE |
దేశం | ఇరాన్ |
భాష | క్లాసికల్ పర్షియన్ |
విషయము(లు) | పర్షియన్ పురాణేతిహాసాలు, ఇరాన్ చరిత్ర |
కళాప్రక్రియ | ఇతిహాస కావ్యం |
Meter | 22 శబ్దాలతో కూడిన రెండు లైన్లు, ప్రాస కలిగిన రెండు పాదాల పద్యాలు (ద్విపదలు) (bahr-i mutaqarib-i mahzuf)[1] |
Publication date | 1010 |
Published in English | 1832 |
Media type | మాన్యుస్క్రిప్ట్ |
వరుసలు | c. 50,000 మాన్యుస్క్రిప్టుని బట్టి |
Preceded by | ఖ్వాదే-నమగ్ |
ఈ రచన పర్షియన్ సంస్కృతిలోనూ, పర్షియన్ భాషలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగి కేంద్ర స్థానంలో నిలుస్తోంది. ఇది సాహిత్యపరంగా కళాఖండంగా, ఇరాన్ జాతీయత, సాంస్కృతికకు చిహ్నంగా నిలిచింది. జొరాస్ట్రియనిజం మతంలోనూ ఇది చాలా ముఖ్యమైనది. దీనిలో ఆ మతం ప్రారంభ వికాసాల నుంచి ఇరాన్‌లో జొరాస్ట్రియన్ ప్రభావానికి తుదివాక్యం పలికిన చివరి సాసానియన్ చక్రవర్తి మరణం వరకూ వివిధ చారిత్రక అంశాలను పొందుపరిచి ఉంది.
కూర్పు
మార్చు977లో ఫిరదౌసి షానామా రాయడం ప్రారంభించి, 1010 మార్చి 8న పూర్తి చేశాడు. షానామా కవిత్వంలోనూ, చరిత్ర రచనలోనూ అత్యంత ప్రముఖమైనదిగా నిలిచిపోయింది. ఈ రచన ఫిరదౌసీ, అతని సమకాలీనులు, పూర్వీకులు ఇరాన్ ప్రాచీన చరిత్ర అని దేన్ని భావించారో ఆ వృత్తాంతానికి కవితాత్మక రూపంగా నిలిచింది. ఈ వృత్తాంతాన్ని గద్యరూపంలో రాసిన రచనలు అనేకం ఉన్నాయి. అబూ-మన్సూరి షానామా ఈ తరహా గద్య రచనలకు ఒక ఉదాహరణ. షానామా మొత్తంగా చూస్తే పూర్తిగా ఫిరదౌసీయే కల్పించిన రచన కొద్ది భాగమే. అదీ మొత్తం షానామాలో అక్కడక్కడా చెదురుమదురుగా కనిపిస్తూంటుంది.
షానామా తొలినాళ్ళకు చెందిన నూతన పర్షియన్ భాషలో 50 వేలకు పైగా ద్విపద కవితల్లో రాసిన ఐతిహాసిక కావ్యం. ఇది ప్రధానంగా ఈనాటి ఈశాన్య ఇరాన్ ప్రాంతంలోని తన ప్రాంతమైన టుస్ నగరంలో ఫిరదౌసి తన జీవితంలోని తొలి దశ గడుపుతున్నప్పుడు రూపొందిన షానామా అనే మరో గద్య రచన దీనికి ఆధారం. షానామా అన్న ఈ గద్య రచన ఖ్వాదే-నమగ్ (రాజుల పుస్తకం) అన్న పహ్లవీ (మధ్య పర్షియన్ భాష) రచనకు అనువాదం. ఈ ఖ్వాదే-నమగ్ అన్నది పర్షియాకు చెందిన రాజులు, వీరులకు సంబంధించిన గాథలను పౌరాణిక కాలం నుంచి రెండవ ఖుస్రో (సా.శ. 590-628) కాలం వరకూ సేకరించి చేసిన సంకలనం. ఇది ససానియన్ సామ్రాజ్య కాలపు మలి దశలో రూపొందింది. ఖ్వాదే-నమగ్లో ససానియన్ సామ్రాజ్యపు మలిదశకు చెందిన చారిత్రక సమాచారం ఉంటుంది, ఐతే సా.శ. 3, 4 శతాబ్దాలకు చెందిన తొలి ససానియన్ సామ్రాజ్యపు దశకు చెందిన వివరాలు మాత్రం చారిత్రక మూలాలు, ఆధారాల నుంచి సేకరించి రాసినట్టుగా కనిపించవు.[3] ఈ మొత్తం గాథలకు ఫిరదౌసి ఏడవ శతాబ్ది మధ్యకాలంలో ముస్లిం సైన్యాలు ససానియన్లను జయించి ఇరాన్ ని ఆక్రమించిన గాథను చేర్చాడు.
పహ్లవీ భాషా ఇతిహాసాన్ని కవిత్వ రూపంలో అనువదించే కృషిని చేపట్టిన మొదటి వ్యక్తి ఫిరదౌసికి సమకాలికుడైన పర్షియన్ కవి దఖిఖి. ఇతను సమానిడ్ సామ్రాజ్యపు ఆస్థాన కవుల్లో ఒకడు. వెయ్యి పద్యాలు పూర్తయ్యాకా తన బానిస చేతిలో హత్యకు గురై చనిపోయాడు. ఈ వెయ్యి పద్యాల్లో జొరాస్టర్ ప్రవక్తగా ఎదగడం, అతని ప్రభావం గురించి ఉంటుంది. ఈ కవితలను ఫిరదౌసి తర్వాతి కాలంలో తన రచనలో చేర్చుకుని ఆ పద్యాలు దఖిఖి రచనేనన్న గుర్తింపు తెలుపుతూ ఒక పద్యం రాశాడు. షానామా శైలిలో రాత, మౌఖిక సంప్రదాయాలు రెండూ కనిపిస్తాయి. కొందరు జొరాస్ట్రియన్ పవిత్ర గ్రంథాల సంపుటి అవెస్తాలోని భాగమైన నస్క్ లను కూడా ఫిరదౌసి మూలాలుగా వాడుకున్నాడని పేర్కొంటూంటారు.[4]
ఈ ఐతిహాసానికి ఇతివృత్తాన్ని ఎన్నో పహ్లవీ గ్రంథాల నుంచి స్వీకరించారు, వాటన్నిటిలోకీ ముఖ్యమైనది కర్నామాగ్-ఇ అర్దాషిర్-ఇ పాబగాన్ (Kar-Namag i Ardashir i Pabagan; పేరుకు అర్థం: పాపక్ కుమారుడైన అర్దేషిర్ చేసిన కార్యాల పుస్తకం) అన్న రచన. ఇది సస్సానిడ్ యుగానికి చివరి దశలో రాసినది, దీనిలో మొదటి అర్దాషిర్ ఎలా అధికారంలోకి వచ్చాడన్న విషయాలు నమోదయ్యాయి. చారిత్రకంగా దీన్ని రాసిన కాలం, ఆ ఘటనలు జరిగిన కాలానికి చాలా దగ్గర కావడంతో ఈ రచన చాలా కచ్చితమైనదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఫిరదౌసి షానామాలోని చాలావరకూ చారిత్రక వృత్తాంతాలను దీని నుంచే తీసుకున్నాడు. ఇరానియన్ స్టడీస్ పండితుడైన జబిహొల్లా సాఫా ప్రకారం ఫిరదౌసీ షానామాలోని పలు పద్యాల్లోని పలు పదాలు, పదబంధాలు ఈ మూలంలోని పదాలు, పదబంధాలు ఒకటే.[5]
నోట్స్
మార్చుమూలాలు
మార్చు- ↑ "History" (PDF). eprints.soas.ac.uk. Retrieved 2020-01-25.
- ↑
- ↑ Zaehner, Robert Charles (1955). Zurvan: a Zoroastrian Dilemma. Biblo and Tannen. p. 10. ISBN 0819602809.
- ↑ "A possible predecessor to the Khvatay-Namak could be the Chihrdad, one of the destroyed books of the Avesta (known to us because of its listing and description in the Middle Persian Zoroastrian text, the Dinkard 8.13)." K.E. Eduljee, Zoroastrian Heritage, "Ferdowsi's Shahnameh," http://www.heritageinstitute.com/zoroastrianism/shahnameh/
- ↑ meh/
ఆధార గ్రంథాలు
మార్చు- Farmanfarmaian, Fatema Soudavar (2009). "Georgia and Iran: Three Millennia of Cultural Relations An Overview". Journal of Persianate Studies. 2 (1). BRILL: 1–43. doi:10.1163/187471609X445464.