షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీకి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్ నుండి కార్పొరేటర్‌గా గెలిచి 2023 ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైంది.[1]

షెల్లీ ఒబెరాయ్

ఢిల్లీ మేయర్‌
పదవీ కాలం
22 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం
డిప్యూటీ ఆలే మహ్మద్ ఇక్బాల్‌
ముందు Post created
నియోజకవర్గం వార్డ్ నెం. 86

వ్యక్తిగత వివరాలు

జననం 1984 (age 39-40)
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
పూర్వ విద్యార్థి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ
వృత్తి ప్రొఫెసర్, రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం

మార్చు

షెల్లీ ఒబెరాయ్ 1984లో జన్మించింది. ఆమె హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్‌లో ఫిలాసపీలో డాక్టర్ పట్టా అందుకుంది. షెల్లీ ఒబెరాయ్ కాలేజీలో అత్యధిక గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ సాధించినందుకు స్కాలర్‌షిప్‌తో పాటు, 'మిస్ కమ్లా రాణి' ప్రైజ్‌ను అందుకుంది. ఆమె ఆ తరువాత ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసింది.[2]

రాజకీయ జీవితం

మార్చు

షెల్లీ ఒబెరాయ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి , ఢిల్లీ ఆప్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పని చేసి చేసింది. ఆమె 2022 డిసెంబర్ 7న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ 86వ వార్డ్ నుండి కార్పొరేటర్‌గా గెలిచి 2023 ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైంది.[3][4]

మూలాలు

మార్చు
  1. Eenadu (27 February 2023). "హోరాహోరీగా దిల్లీ మేయర్‌ ఎన్నిక.. కొత్త మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌". Archived from the original on 27 February 2023. Retrieved 27 February 2023.
  2. Andhra Jyothy (22 February 2023). "షెల్లీ ఒబెరాయ్ ఎవరో తెలుసా..?". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  3. Namasthe Telangana (22 February 2023). "ఢిల్లీ మేయ‌ర్‌గా షెల్లీ ఒబెరాయ్‌.. 34 ఓట్ల తేడాతో నెగ్గిన ఆప్ అభ్య‌ర్ధి". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  4. TV5 News (22 February 2023). "ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్.. ఎవరీమె" (in ఇంగ్లీష్). Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)