షేక్ యాస్మీన్ బాషా
మత సామరస్యానికి మారు పేరుగా నిలుస్తున్న షేక్ యాస్మిన్ బాషా ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు మూడవ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
వ్యక్తిగత జీవితం
మార్చుషేక్ యాస్మిన్ బాషా[1] స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం. నాన్న షేక్ యూసఫ్ బాషా ఆర్మీలో పని చేసేవారు. తల్లి షేక్ షబ్బీర్ అలీయూసఫ్ హోం మేకర్. నలుగురు ఆడ పిల్లల సంతానంలో షేక్ యాస్మిన్ బాషా పెద్దది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే షేక్ ఇమామ్ హుస్సెన్‌తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అజ్మల్ హుస్సెన్, కూతురు ఫాతిమాలు ఉన్నారు.
ఉద్యోగ వివరాలు
మార్చు2003లో ఆమె గ్రూప్-1 పరీక్ష రాశారు. 2007లో దాని ఫలితాలు వచ్చాయి. 2008లో మెదక్ జిల్లాలో హత్నూరా మండలానికి సంవత్సరం పాటు ఎంపీడీఓగా చేశారు. వెంటనే డిప్యూటీ కలెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది. అందులో కూడా ఉత్తీర్ణత సాధించి, అప్పుడు మొదటి పోస్టింగ్ 2011లో ఎఫ్‌ఎస్‌ఓ (ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి)గా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. డీపీఓ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా, మొట్టమొదటి మీసేవా కో అర్డినేటర్‌గా, డీఆర్‌ఓగా పనిచేశారు. ఆ తర్వాత మెదక్ సర్వశిక్షఅభియాన్ (అప్పట్లో ఆర్‌వీఎం) పీఓగా పనిచేశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సీనియారిటీలో దిగువన ఉన్నప్పటికీ, ఆమె ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి, ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆమెను నియమించింది. 2020లో వనపర్తి జిల్లాకు కలెక్టర్‌గా నియామకం అయ్యారు. కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, జిల్లాలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్[2] కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధరణి సమస్యలను పరిష్కరించారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను అగ్రపథంలో నడిపించారు. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులతో 2023 ఫిబ్రవరి 1న ఆమె జగిత్యాల జిల్లా మూడవ కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల'ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత జిల్లా ఎన్నికల అధికారిగా డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు.
మత సామరస్యానికి నిదర్శనం
మార్చుజగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం ధర్మపురి నరసింహుని ఆలయం[3]. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మైనార్టీ వర్గానికి చెందిన యాస్మిన్ బాషా నుదిటికి బొట్టు పెట్టుకుని, తలపాగ ధరించి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనేక వర్గాలు ఆమెపై ప్రసంశల వర్షం కురిపించాయి.
అవార్డులు
మార్చువనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో రెడ్ క్రాస్ సంస్థ[4] ద్వారా ఉత్తమ సేవలు అందించినందుకు గాను షేక్ యాస్మిన్ బాషా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా బంగారు పతకం, ట్రోఫీ అందుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ https://www.andhrajyothy.com/2020/telangana/mahbubnagar/mahaboobnagar-story-31491.html.
{{cite news}}
: Missing or empty|title=
(help) - ↑ "https://wanaparthy.telangana.gov.in/te/event/%E0%B0%B5%E0%B0%A8%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C/". Government official Portal.
{{cite news}}
: External link in
(help)|title=
- ↑ "https://telugu.samayam.com/photo-gallery/general/jagtial-collector-shaik-yasmeen-basha-in-dharmapuri-lakshmi-narasimha-swamy-brahmostavam/photoshow/msid-98416909,picid-98416929.cms". The Times of India Samayam.
{{cite news}}
: External link in
(help)|title=
- ↑ "https://wanaparthy.telangana.gov.in/red-cross-organization/". Government official portal.
{{cite news}}
: External link in
(help)|title=