సెహ్రా

(షేరా నుండి దారిమార్పు చెందింది)

ముస్లింలు వివాహ సమయంలో పెళ్ళికుమారునికి వేసే పూల ముసుగును సెహ్రా అంటారు.పెళ్లికి ముందు జరిగే ఊరేగింపులో పెళ్ళి కుమారునికి దీనిని ధరింపజేసి గుర్రంపై లేదా కారు, జీపు, ఎద్దులబండి, గుర్రంబండి, సైకిలు వంటి వాహనాలపై ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.సాధారణంగా పెళ్ళి కొడుకు ఇంటి నుంచి లేదా విడిది ఇంటి నుంచి సెహ్రా ధరించిన పెళ్ళికొడుకుని ఊరేగింపుగా పెళ్ళికూతురు ఇంటి వద్దకు లేదా పెళ్ళి మండపం వద్దకు తీసుకువెళ్లతారు. ఈ సెహ్రాను మల్లె పూలతో లేదా తెల్ల గన్నేరు పూలతో లేదా ఇతర కొన్ని రకాల తెల్లని పూలతో తయారు చేస్తారు.[1]

గుర్రంపై సెహ్రాను ధరించిన పెళ్ళి కుమారుడు

ఇతర సమాజాలలో సెహ్రా

మార్చు

ముస్లిముల పెండ్లిండ్లలోనే గాక హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధులు మొదలగు మతసంబంధ సమాజలలో ఈ సెహ్రా సామాన్యంగా కానవస్తుంది. ఉదాహరణకు రాజస్థాన్ లోని రాజపుత్రుల వివాహ సందర్భాలలో సామాన్యం.

మూలాలు

మార్చు
  1. "Sehra: Traditional Headdress For Indian Groom". Utsavpedia. 18 June 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=సెహ్రా&oldid=3578666" నుండి వెలికితీశారు