మన దేశంలో పేరు మోసిన బందిపోటు రాణి పూలన్ దేవి. ఈమె తర్వాతి కాలంలో భారత దేశ రాజకీయాలలో ప్రవేశించి తన పై వున్న నేరాలను రద్దు పర్చుకుంది. పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది. కాని చిన్ననాటి శత్రువులు ఈమెను హతమార్చడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. వారి నాయకుడైన షేర్ సింగ్ రాణా పూలన్ దేవిని ఆమె అధికార నివాసము ముందు 25 జూలై 2001 నాడు అతి దగ్గరగా కాల్చి చంపాడు.[1]

పూలన్ దేవి చరిత్ర

మార్చు

ఫూలన్ దేవీ భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ బందిపోటు రాణి. ఈమె చంబల్ లోయలో తనకు బాల్యంలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సొంత ముఠాను ఏర్పరుచుకొని బందిపోటు నాయకురాలిగా ఎదిగింది. తరువాత ప్రభుత్వానికి లొంగిపోయి రాజకీయాలలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సమాజ్ వాద్ పార్టీ ఆమె పై వున్న అన్ని నేరాలను కొట్టి వేసింది. ఆ కారణంగా జైలు నుండి బయటకు వచ్చిన పూలన్ దేవి సమాజ్ వాది పార్టీ తరపున లోక్ సభకు పోటి చేసి 1996లో గెలుపొందారు. కాని ఆమె పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున కొంత మంది శత్రువులు 25 జూలై 2001 నాడు పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్నభోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆమెను ఆమె ఇంటి ముందే ముసుగులు ధరించి కాల్చి చంపేశారు.[2] [3]

శత్రువుల దాడి

మార్చు

సుదీర్గ విచారణ తర్వాత పూలన్ దేవి హంతకుడుగా షేర్ సింగ్ రాణా ను నిర్ణయించి ఢిల్లీ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అతడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. 2014 ఆగస్టు 8న అతడిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది

ఫూలన్ దేవిని కాల్చి చంపిన షేర్ సింగ్ రాణా నిజ జీవిత కథతో 2022లో బయోపిక్ రూపొందుతోంది. ఆ సినిమా పేరు `షేర్ సింగ్ రాణా'. విద్యుత్ జమాల్ హీరోగా దర్శకుడు వినోద్ భానుశాలి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.[4]

మూలాలు

మార్చు
  1. "Phoolan Devi's killer arrested in Kolkata". The Times Of India. 25 April 2006. Archived from the original on 2013-12-03. Retrieved 2014-08-15.
  2. "Man arrested for murder of 'Bandit Queen'". The Telegraph. London. 27 July 2001. Retrieved 9 August 2012.
  3. "Profile of Sher Singh Rana". Times of India. 27 July 2001. Retrieved 9 August 2012.
  4. "ఎవరీ Sher Singh Rana.. Phoolan Devi ని చంపిన ఇతడి లైఫ్ స్టోరీతో బాలీవుడ్‌లో మరో బయోపిక్..!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-03-30. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.

ఇతర లింకులు

మార్చు