షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
(షోలాపూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం (Solapur Lok Sabha constituency) మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1951 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జాతీయ కాంగ్రెస్ 12 సార్లు, భారతీయ జనతా పార్టీ 3 సార్లు గెలుపొందగా, 1951లో తొలి ఎన్నికలలో పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ గెలుపొందినది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ శిండే ఈ నియోజకవర్గం నుండి 3వ పర్యాయం గెలుపొందినాడు.
షోలాపూర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 17°39′36″N 75°55′12″E |
నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చునియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు
మార్చు- 1951: శంకర్ శాంతారాం మోరే (పేసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ)
- 1957: తాయప్ప హరి సోనావానే (కాంగ్రెస్ పార్టీ)
- 1962: మాదెప్ప బీండప్ప కడాడి (కాంగ్రెస్ పార్టీ)
- 1967: సూరజ్‌రతన్ ఫతేచంద్ దమాని (కాంగ్రెస్ పార్టీ)
- 1971: సూరజ్‌రతన్ ఫతేచంద్ దమాని (కాంగ్రెస్ పార్టీ)
- 1977: సూరజ్‌రతన్ ఫతేచంద్ దమాని (కాంగ్రెస్ పార్టీ)
- 1980: గంగాధర్ కుచన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1984: గంగాధర్ కుచన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1989: ధర్మన్న సాధుల్ (కాంగ్రెస్ పార్టీ)
- 1991: ధర్మన్న సాధుల్ (కాంగ్రెస్ పార్టీ)
- 1996: లొంగరాజ్ వల్యాల్ (భారతీయ జనతా పార్టీ)
- 1998: సుశీల్ కుమార్ శిండే (కాంగ్రెస్ పార్టీ)
- 1999: సుశీల్ కుమార్ శిండే (కాంగ్రెస్ పార్టీ)
- 2003 (ఉప ఎన్నికలు) : ప్రతాప్‌సింగ్ శంకర్‌రావు మోహితే పాటిల్ (భారతీయ జనతా పార్టీ)
- 2004: సుభాష్ దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
- 2009: సుశీల్ కుమార్ శిండే (కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు
మార్చు2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుశీళ్ కుమార్ శిండే తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన శరద్ బాన్సోడేపై 99632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శిండేకు 3,87,591ఓట్లు రాగా బాన్సోడేకు 2,87,959 ఓట్లు లభించాయి. బీఎస్పీకి చెందిన ప్రమోద్ గైక్వాడ్‌కు 30,457 ఓట్లు వచ్చాయి.