దైనందిన జీవితంలో ప్రతీ విషయం పరిమాణాత్మకంగా చెప్పడం కద్దు. పరిమాణంలో తెలియ చేయడానికి కొలత ఉండాలి. సంఖ్య, కొలమానానికి ఉపయుక్తమయ్యే సాధనం.

తెలుగు అరబిక్ సంఖ్యలు

మార్చు

ప్రతి భాషలో సంఖ్యలున్నాయి. అదే విధంగా తెలుగు భాషలో కూడా సంఖ్యలున్నాయి. కాగా, అరబిక్ సంఖ్యలను అంతర్జాతియంగా వాడుతున్నారు. తెలుగు, అరబిక్ సంఖ్యలు క్రింద చూపబడినవి.

సంఖ్య తెలుగు ! అరబిక్
సున్న 0
ఒకటి 1
రెండు 2
మూడు 3
నాలుగు 4
ఐదు 5
ఆరు 6
ఏడు 7
ఎనిమిది 8
తొమ్మిది 9
పది ౧౦ 10
నూరు ౧౦౦ 100

సంఖ్యామానం

మార్చు

భారత విధానంలో సంఖ్యలను ఒకట్లు, పదులు, వేలు, వందలు, పది వేలు, లక్ష, పది లక్షలు, కోట్లు అని చదివతే, అంతర్జాతియ విధానంలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, పది వేలు, వంద వేలు, మిలియన్ అని చదువుతారు. వంద వేలు ఒక లక్ష అయితే, వేయి వేలు మిలియన్. పది లక్షలు ఒక మిలియన్. నూరు లక్షలు కోటి లేదా పది మిలియన్లు ఒక కోటి. వేయి మిలియన్లు ఒక బిలియన్. వేయి బిలియన్లు ఒక ట్రిలియన్. తెలుగు సంఖ్యామానం,అంతర్జాతీయ సంఖ్యామానం ఈ క్రింది విధం గా ఉంటాయి.

పది వర్గం తెలుగు సంఖ్యామానం అంతర్జాతియ సంఖ్యామానం
1 ౧౦ (పది) 10 (పది)
2 ౧౦౦ (వంద) 100 (హండ్రెడ్)
3 ౧,౦౦౦ (వేయి) 1000 (థౌజండ్)
4 ౧౦,౦౦౦ (పది వేలు) 10,000 (టెన్ థౌజండ్)
5 ౧,౦౦,౦౦౦ (లక్ష) 100,000 (హండ్రెడ్ థౌజండ్)
6 ౧౦,౦౦,౦౦౦ (పది లక్షలు) 1,000,000 (మిలియన్)
7 ౧,౦౦,౦౦,౦౦౦ (కోటి) 10,000,000 (పది మిలియన్లు)
8 ౧౦,౦౦,౦౦,౦౦౦ (దశ కోటి లేదా పది కోట్లు) 100,000,000 (వంద మిలియన్లు)
9 ౧౦౦,౦౦,౦౦,౦౦౦ (శత కోటి లేదా వంద కోట్లు) 1000,000,000 (బిలియన్)
10 ౧౦౦౦,౦౦,౦౦,౦౦౦ (సహస్ర కోటి లేదా వేయి కోట్లు లేదా అర్బుదము) 10000,000,000 (పది బిలియన్లు)
11 ౧౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (పది వేల కోట్లు లేదా న్యర్బుదము) 100,000,000,000 (వంద బిలియన్లు)
12 ౧౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (లక్ష కోట్లు లేదా ఖర్వము) 1000,000,000,000 (ట్రిలియన్)
13 ౧౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (పది లక్షల కోట్లు లేదా మహా ఖర్వము)
14 ౧౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (కోటి కోట్లు లేదా పద్మము)
15 ౧౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా పద్మము)
16 ౧౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (క్షోణి)
17 ౧౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా క్షోణి)
18 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(శంఖం)
19 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(మహా శంఖం)
20 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(క్షితి)
21 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(మహా క్షితి)
22 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(క్షోభము)
23 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా క్షోభము)
24 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (నిధి)
25 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా నిధి)
26 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(పరాటం)
27 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(పరార్థం)
28 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అనంతము)
29 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(సాగరము)
30 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (అవ్యయం)
31 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అమృతం)
32 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అచింత్యం)
33 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (అమేయము)
34 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (భూరి)
35 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (మహా భూరి)