సంగీతా కుమారి సింగ్ డియో

సంగీత కుమారి సింగ్ డియో (జననం 3 డిసెంబర్ 1961) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.[2] ఆమె బోలంగీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైంది.

సంగీత కుమారి సింగ్ డియో
సంగీతా కుమారి సింగ్ డియో

సంగీత సింగ్ డియో


లోక్‌సభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు కాళికేష్ నారాయణ్ సింగ్ దేవ్
నియోజకవర్గం బోలంగీర్
పదవీ కాలం
1998 – 2009
ముందు శరత్ పట్టణాయక్
తరువాత కాళికేష్ నారాయణ్ సింగ్ దేవ్
నియోజకవర్గం బోలంగీర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-12-03) 1961 డిసెంబరు 3 (వయసు 62)
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ బీజేపీ
తల్లిదండ్రులు అమర్ సింగ్, ప్రభా సింగ్
జీవిత భాగస్వామి కనక్ వర్ధన్ సింగ్ డియో[1]
సంతానం నివృత్తి కుమారి మేవార్
నివాసం శైలశ్రీ ప్యాలెస్, బోలంగీర్ , ఒడిశా
మూలం [1]

జననం, విద్యాభాస్యం

మార్చు

సంగీత కుమారి సింగ్ డియో 1961 డిసెంబర్ 3న న్యూఢిల్లీలో అమర్ సింగ్, ప్రభా సింగ్ దంపతులకు జన్మించింది. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుండి పొలిటికల్ సైన్స్‌లో బిఎ (ఆనర్స్), న్యూ ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ నుండి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. ఆమె తండ్రి అమర్ సింగ్, ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి, న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో పీఆర్ ఇన్‌ఛార్జ్‌గా పదవీ విరమణ చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

సంగీత కుమారి సింగ్ డియో తన భర్త కనక్ వర్ధన్ సింగ్ డియో అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బోలంగీర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి గెలిచి 12వ లోక్‌సభకు ఎన్నికైంది. ఆమె 1999, 2004లో గెలిచి 2014లో ఓటమిపాలై 2019, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి లోక్‌సభకు ఎన్నికైంది.

సంగీత కుమారి సింగ్ డియో 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బోలంగీర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తాం సమీప బీజేడీ అభ్యర్థి సురేంద్ర సింగ్ బోయిపై 132664 ఓట్ల తేడాతో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఈ ఎన్నికలలో సంగీతకు  6,17,744 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి బిజూ జనతాదళ్ (బిజెడి) అభ్యర్థి సురేంద్ర సింగ్ భోయ్ 4,23,309 ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ మిశ్రా 1,97,091 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

మార్చు
  1. The Week (26 April 2024). "All royal family members contesting Odisha assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  2. The Indian Express (2024). "Sangeeta Singh Deo" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Bolangir". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.