సంజయ్ బన్సోడ్‌ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో 2019 డిసెంబర్ 30 నుండి 2022 జూన్ 29 వరకు రాష్ట్ర పర్యావరణ, నీటి సరఫరా & శానిటేషన్, పబ్లిక్ వర్క్స్ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]

సంజయ్ బన్సోడ్‌
సంజయ్ బన్సోడ్‌


పర్యావరణ, నీటి సరఫరా & శానిటేషన్ , పబ్లిక్ వర్క్స్ శాఖల సహాయ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్యే
ముందు సుధాకర్ భలేరావు
నియోజకవర్గం ఉద్గిర్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-12-31) 1973 డిసెంబరు 31 (వయసు 50)
ఉద్గిర్, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం మౌళి నివాస్, ఎస్టీ కాలనీ, నాల్గాన్ రోడ్, ఉద్గిర్, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సంజయ్ బన్సోడ్‌ 2002లో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన • 1992 నుండి 1999 వరకు యూత్ కాంగ్రెస్ రీజినల్ ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసి అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సంజయ్ బన్సోడ్‌ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున ఉద్గిర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ సదాశివ్ కాంబ్లే పై 20579 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 30 డిసెంబర్ 2019న ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర పర్యావరణ, నీటి సరఫరా & శానిటేషన్, పబ్లిక్ వర్క్స్ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 29 జూన్ 2022 వరకు విధులు నిర్వహించాడు.[2]

మూలాలు

మార్చు
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. DNA India (5 January 2020). "Maharashtra government portfolios allocated: Full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.