సంతోష్ వెంపల

సంతోష్ వెంపల (జననం18 అక్టోబరు 1971) భారతదేశానికి చెందిన కంప్యూటరు శాస్త్రవేత్త. ఆయన జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటరు సైన్స్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఆయన థియరిటికల్ కంప్యూటరు సైన్స్ రంగంలో ప్రధానంగా కృషి చేస్తున్నారు.[1][2]

సంతోష్ వెంపల
జననం (1971-10-18) 1971 అక్టోబరు 18 (వయస్సు 50)
విశాఖపట్నం, భారతదేశం
నివాసంఅట్లాంటా, జార్జియా
రంగములుకంప్యూటరు విజ్ఞానం
విద్యాసంస్థలుఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
చదువుకున్న సంస్థలుకార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)అవిరిం బ్లం
ముఖ్యమైన పురస్కారాలుకంప్యూటర్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ యొక్క ఫెలోషిప్ (2015)

జీవిత విశేషాలుసవరించు

ఆయన తన పి.హెచ్.డి కోసం 1997లో కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఈ పి.హెచ్.డి ని అవ్రిం బ్లం అనే ప్రొఫెసర్ వద్ద చేసారు.[3]

1997లో బెర్కెలీ వద్ద మిలెర్ ఫెలోషిప్ పొందారు. అదేవిధంగా ఆయన 2006లో జార్జియా టెక్ కు వెళ్ళినంత వరకు ఎం.ఐ.టి లో ప్రొఫెసరుగా తన సేవలనందించారు.

పనులుసవరించు

ఆయన ప్రధానంగా "థియరిటికల్ కంప్యూటర్ సైన్స్" రంగంలో తన కృషిని కొనసాగించారు. ప్రత్యేకంగా ఆయన "ఆల్గరిథిమ్స్", "రాండమైజ్డ్ ఆల్గరిథిమ్స్", "కంప్యూటేషనల్ జామెట్రీ", "కంఫ్యుటేషనల్ లెర్నింగ్ థియరీ" వంటి రంగాలలొ విశేష సేవలనందిస్తున్నారు. ఆయన రాండం ప్రొజెక్షన్[1] , స్పెక్ట్రల్ మెథడ్స్.[2] లపై పుస్తకాలను రచించాడు.

2008లో ఆయన జార్జియా టెక్ అద్ద కంప్యూటింగ్ ఫర్ గుడ్ (C4G)[4] ప్రోగ్రామ్ కు సహ వ్యాస్థాపకునిగా ఉన్నారు.

పురస్కారాలు, గౌరవాలుసవరించు

ఆయన అనేక పురస్కారములు పొందారు. వాటిలో గుట్టెన్‌హీం ఫెలోషిప్, సోయాన్ ఫెలోషిప్, "జార్జియా ట్రెండ్స్" జాబితాలో స్థానం పొందారు.[5]

ఆయన "కుంభాకార సమితులు, సంభావ్యత విభజనం ల కొరకు ఆల్గరిథమ్స్ యొక్క కృషికి" ఎ.సి.ఎం ఫెలోషిప్ ను 2015లో పొందారు..[6]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 S. Vempala, ``The Random Projection Method", American Mathematical Society, 2004.
  2. 2.0 2.1 R. Kannan and S. Vempala,``Spectral Algorithms, Now Publishers Inc., 2009.
  3. మూస:Mathgenealogy.
  4. "Computing for Good". Archived from the original on 2012-11-01. Retrieved 2016-11-19.
  5. “Georgia Trend 40 Under 40,” Georgia Trend Magazine, October 2010
  6. "ACM Fellows Named for Computing Innovations that Are Advancing Technology in the Digital Age". ACM. 8 December 2015. Archived from the original on 9 డిసెంబర్ 2015. Retrieved 9 December 2015. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులుసవరించు