శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌ ఒమన్‌ దేశానికి చెందిన క్రికెటర్‌. ఆయన 2005 నుండి 2008 వరకు హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్ 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఒకవైపు ఉద్యోగం వేట కొనసాగిస్తూనే మరోవైపు అక్కడి దేశవాళీ మ్యాచుల్లో మంచి ప్రతిభ కనబర్చి 2019 ఫిబ్రవరిలో ఒమన్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[1]

సందీప్ గౌడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సందీప్ గౌడ్
పుట్టిన తేదీ (1991-11-08) 1991 నవంబరు 8 (వయసు 33)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
బౌలింగుకుడి చేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 9)2019 ఏప్రిల్ 27 - (నమీబియా) తో
చివరి వన్‌డే2021 2 అక్టోబరు - (స్కాట్లాండ్) తో
తొలి T20I (క్యాప్ 24)2019 ఫిబ్రవరి 15 - (నెదర్లాండ్స్) తో
చివరి T20I2021 21 అక్టోబరు - (స్కాట్లాండ్) తో
మూలం: Cricinfo, 21 అక్టోబరు 2021

జననం, విద్యాభాస్యం

మార్చు

సందీప్‌ గౌడ్‌ 1991 నవంబరు 8లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు లోని కవాడిగూడలో జన్మించాడు. ఆయన ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు, [2] చిక్కడపల్లిలోని అరోరా కాలేజీలో బీకామ్‌ పూర్తి చేశాడు.[3]

క్రీడా జీవితం

మార్చు

సందీప్‌ గౌడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్ఫూర్తితో క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకొని 2005 నుండి 2008 వరకు హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ఆడాడు. ఆయన బీకామ్‌ చదువుకుంటూనే ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యాడు. సందీప్ 2009-10 సీజన్‌లో అండర్‌-22 కల్నల్‌ సీకే నాయుడు టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్‌కి 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్‌ కంపెనీలో ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. ఆయన ఒమాన్ దేశవాళీ క్రికెట్ లో ఒమన్‌ డెవలప్‌మెంట్‌ ఎలెవెన్‌ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడంతో ఒమాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. 10TV (అక్టోబరు 17 2021). "టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం నుంచి ఆడుతున్న తెలుగు కుర్రాడు | Telugu Boy Playing from Oman in T20 World Cup" (in telugu). Archived from the original on అక్టోబరు 24 2021. Retrieved అక్టోబరు 24 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Telangana Today (అక్టోబరు 20 2021). "From All Saints High School to T20 World Cup". Archived from the original on అక్టోబరు 24 2021. Retrieved అక్టోబరు 24 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Sakshi (అక్టోబరు 17 2021). "ఒమన్‌ జట్టులో హైదరాబాదీ క్రికెటర్‌." Archived from the original on అక్టోబరు 24 2021. Retrieved అక్టోబరు 24 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. Eenadu (అక్టోబరు 17 2021). "ఒమన్‌ జట్టులో కవాడిగూడ క్రికెటర్‌ - telugu news Kawadiguda cricketer in the Oman team in t20 world cup". Archived from the original on అక్టోబరు 24 2021. Retrieved అక్టోబరు 24 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)