బైర్రాజు సంధ్యా రాజు (జననం 1982 మార్చి 25) ఒక భారతీయ కూచిపూడి నర్తకి. సినిమా నటి కూడా.[3] ఆమె డాక్టర్ వెంపటి చినసత్యం శిష్యురాలు. 2013 హిందీ లఘు చిత్రం యాధోన్ కి బారాత్‌లో ఆమె నటించింది. 2017 మలయాళలో థ్రిల్లర్ చిత్రం కేర్‌ఫుల్‌లో తొలిసారిగా నటించింది.[4] ఆమె నటించిన తెలుగు షార్ట్ ఫిల్మ్‌ నాట్యం[5] అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా 2016లో విడుదల చేసారు.[6][7] ఆమె రామ్‌కో ఇండస్ట్రీస్ చైర్మన్ పి. ఆర్. వెంకట్రామ రాజాకి పెద్ద సంతానం. ఆమె వ్యాపారవేత్త బైర్రాజు రామలింగరాజు కుమారుడు రామరాజును వివాహం చేసుకుంది.[8] ఆమె కూచిపూడిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించి నిష్రింకాల డాన్స్ అకాడమీని స్థాపించింది.[9][10][11] ఆమె రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

సంధ్య రాజు[1]
నాట్యం (2021) సినిమాలో సంధ్య రాజు
జననం
శ్రీ సంధ్యా రాజా

(1982-03-25) 1982 మార్చి 25 (వయసు 42)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నటి
  • కూచిపూడి నర్తకి
[2]
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బైర్రాజు రామరాజు
(m. 2007)
పిల్లలు1

జీవితం తొలి దశలో

మార్చు

సంధ్య రాజు చెన్నైలోని కృష్ణమూర్తి ఫౌండేషన్ ది స్కూల్ కె.ఎఫ్.ఐ లో తన ప్రాథమిక విద్యను అభ్యిసించింది. ఆమె ఉన్నత పాఠశాల విద్యను బాల విద్యా మందిర్‌లో పూర్తి చేసింది. చెన్నైలోని లయోలా కళాశాలలో ఇంటర్ చదివింది. ఆ తరువాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలయింది. కూచిపూడి ఆర్ట్ అకాడమీలో వెంపటి చిన్న సత్యం ఆధ్వర్యంలో ఆమె పదేళ్ల వయస్సులో నాట్యకారిణిగా శిక్షణ పొందింది. అలాగే ఆమె ప్రముఖ కూచిపూడి గురువు కిషోర్ మొసలికంటి[12] వద్ద కూడా శిక్షణ పొందింది. అంతేకాకుండా ఆయన మార్గదర్శకత్వంలో ఆమె రంగప్రవేశం పూర్తి చేసింది.

కెరీర్

మార్చు

2021లో వచ్చిన నాట్యం సినిమాతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది.[13][14] ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా వివిధ నృత్య రూపాల చుట్టూ తిరుగుతుంది.[15] స్వతహాగా నృత్యకారిణి అయిన సంధ్య రాజు ఈ చిత్రంలో సితారగా నటించడంతోపాటు, ఆమే నృత్య దర్శకురాలిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, నిర్మాతగా పనిచేసింది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ నృత్యాలు, మేకప్‌ విభాగాల్లో 2020కిగానూ జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది.[16]

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Title Role Language Notes Ref.
2012 దేవస్థానం డ్యాన్స్ టీచర్ తెలుగు
2013 యాధోన్ కీ బారాత్ డాక్టర్ హిందీ షార్ట్ ఫిల్మ్; సంధ్యగా ఘనత పొందింది [17][18]
2014 జునూన్ హిందీ షార్ట్ ఫిల్మ్
2016 అన్ టచబుల్
నాట్యం తెలుగు [19]
2017 కేర్‌ఫుల్‌ రచన నంబియార్ మలయాళం ఫీచర్ ఫిల్మ్ అరంగేట్రం [20]
2021 నాట్యం సితార తెలుగు [21][22]

మూలాలు

మార్చు
  1. "Telugu audience has to accept me, says dancer Sandhya Raju". The New Indian Express. Retrieved 2021-02-23.
  2. "కూచిపూడి రాణెమ్మ!". ntnews. 2021-02-18. Retrieved 2021-02-23.
  3. Dundoo, Sangeetha Devi (2017-03-13). "For a spot of spontaneity". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-23.
  4. "Sandhya Raju – Careful is a perfect debut for me". in.news.yahoo.com (in Indian English). Retrieved 2021-02-23.
  5. "'Natyam' will inspire all women: Sandhya Raju". The Indian Express (in ఇంగ్లీష్). 2016-01-22. Retrieved 2021-02-23.
  6. Team, DNA Web (2016-04-29). "International Dance Day: 'Natyam' showcases a woman's love for dance". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  7. "Sandhya Raju took Kuchipudi to a world stage with her performance at an Austrian Museum". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  8. Sridhar, G. Naga. "Ramalinga Raju's kin turns entrepreneur". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  9. "Kuchipudi exponent Sandhya Raju raises funds for dance gurus in a novel way". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  10. India, The Hans (2020-06-11). "For a good cause: Sandhya Raju Raises COVID19 Hardship Fund to Aid Kuchipudi Guru's facing financial adversities". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  11. "In step with pandemic times". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-12-27. Retrieved 2021-02-23.
  12. "Kuchipudi Kalakar: Kishore Mosalikanti". Kuchipudi Kalakar. Retrieved 2021-02-05.
  13. "Kuchipudi dancer Sandhya Raju's first-look from dance film Natyam - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  14. "Kuchipudi dancer Sandhya Raju's first-look from dance film Natyam - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-05.
  15. "Jr NTR launches teaser of Sandhya Raju's 'Natyam'". The News Minute (in ఇంగ్లీష్). 2021-02-10. Retrieved 2021-02-23.
  16. "National Awards: మనసుల్లో నిలిచి... పురస్కారాలు గెలిచి". web.archive.org. 2022-07-23. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. Ej, Ejaz. "This 2 Min Award Winning Short Film By Nag Ashwin Tells Us How Matured His Thoughts Are!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-07-23. Retrieved 2021-02-23.
  18. Hsu, Wendy F. (2016-01-20), "Red Baraat", Oxford Music Online, Oxford University Press, retrieved 2021-02-23
  19. Dundoo, Sangeetha Devi (2016-01-20). "Natyam: A voice through dance". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-05.
  20. "Sandhya Raju, Vijay Babu starrer 'Careful's' trailer is here - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.
  21. "Upasana Unveils The First Look Of Heavenly Natyam". tupaki. Retrieved 2021-02-05.
  22. dhiman, anisha (2016-01-21). "From dancer to a YouTube star". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-02-23.