సంపూర్ణ రామాయణం (1936 సినిమా)

సంపూర్ణ రామాయణం1936 ఆగస్టు 8 న విడుదలైన తెలుగు.పౌరాణిక చలనచిత్రం. ఎస్.బి.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగభూషణం, పుష్పవల్లి నటించారు.ఆరుద్ర రచన చేయగా,సంగీతం కె. వి. మహదేవన్ అందించారు.

సంపూర్ణ రామాయణం
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.బి.నారాయణ
తారాగణం నాగభూషణం,
పుష్పవల్లి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం

మార్చు
  • నాగభూషణం
  • పుష్పవల్లి
  • కాంతామణి
  • రమణీమణి
  • సత్యవతి
  • సుబ్బారావు
  • నారాయణ మూర్తి
  • గంగన్న
  • వీరభద్రరావు
  • వెంకటరత్నం
  • వెంకట్రావు
  • స్వరాజ్యం
  • లక్ష్మీకాంతం
  • సత్యవతి

సాంకేతికవర్గం

మార్చు
  • ఎస్.బి.నారాయణ
  • నిర్మాణ సంస్థ: లక్ష్మి ఎంటర్ ప్రైసెస్
  • రచన:ఆరుద్ర , ముళ్ళపూడి వెంకటరమణ
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
  • కెమెరా: కె.ఎస్.ప్రసాద్
  • నేపథ్య గానం: జి.స్వరాజ్యలక్ష్మీ, కాంతామణి,సుబ్బారావు, ఎం.సూర్యనారాయణ , జగన్నాథరావు , ఆర్.భానుమతి, ఎం.సత్యవతి
  • విడుదల:1936: ఆగస్టు:08.


పాటల జాబితా

మార్చు

1.అనఘలారా యో వనచరులారా భుజాతను నను కాపాడగా

2.అలసితివా ననుగన్న నా తండ్రి పాలు మీగడలు, గానం.జి.స్వరాజ్యలక్ష్మి

3.ఆహా నా భాగ్యమేమి ఆనందమౌ మదిలోనన్, గానం.కాంతామణి

4.ఈవన సోయగము కనుగొనగ అహా ఎంత మనోహరముగా,

5.ఎటుల భరింపనేర్తునో కదా నినుబాసి యసువుల, గానం.జి.రాజ్యం

6. కామిని కైక నాపై ఎంతప్రేమన్ జూపునో నాపై, గానం.సుబ్బారావు

7.చూచితి సీతను కనులగాల్చితి లంకాపురినెల్ల , గానం.ముసునూరి సూర్యనారాయణ

8.జాడ తెలియదాయే హా సఖియా యే కానన సీమల,

9.తెలియదాయె ఎన్నడు సుఖముల గాంచగలనో, గానం.జగన్నాథరావు

10.దాశరధీ కరుణాపయోనిదే ధర్మాంబుదే హే తారకనామ, గానం.ముసునూరి సూర్యనారాయణ

11.ననుబాసి పోదువా ముందుగా ప్రాణానాయకా గానం.ఆర్.భానుమతి

12.నీలోన జెర్చుకొమ్మిదే నీవే నా శరణంబు పావకా

13.పరమ పురుష హే శ్రీశ పతిచే నిటు పాషానమైన, గానం.ఎం.సత్యవతి

14.మంచివారమనగా సంచరించవలెనురా మనము,

15.మది కోరికలెల్ల తీరెన్ మనసిజ రూపున్ పాణి గ్రహీంపన్,

16.మది సండియమందగా నేల ఈ లీల ధైర్య విశాల,

17.మనవి వినుమా నాథా ఆలముసేయగ మనకేల,గానం.వెంకటలక్ష్మి

18.మానసమున కడుధీరుడనని విర్రవీగి సుoత సందియము,గానం. ఎస్ వి.కృష్ణమాచారి .

19.మేఘ శ్యామలా శ్రీలోల దశరధరామా శ్రీరామ, గానం.ముసునూరి సూర్యనారాయణ

20.మునివరా గురు సార్వభౌమ ధన్యులమైతిమి ..

21.రామా రామా రామా సీతారామ రవికుల సోమా, గానం.ముసునూరి సూర్యనారాయణ

22.రామభక్తిన్ సామ్రాజ్యము పరిపాలించేదనే రామపాదుకల,

23.రావేల రఘువంశ సోమా రామా ఈ చెరభాదలనే,..

24. శ్రీ సీతారామచంద్ర హే శ్రీకర శ్రీతజన మందార

25.సదా ఈధరా రాజ్యమెల్లన్ ముడంబార శ్రీరామడెల్లన్, గానం: బృందం

26.స్వామీ తరియించితిమిక నీ కృపచే కోర్కెల్లెల్ల, గానం.జి.స్వరాజ్యం

27.హా నా తనయా నీ మాతను బాసిపోవుదువా, గానం.జి.స్వరాజ్యం .

పద్యాలు

మార్చు

1.అమ్మవు కోరుదానవట అయ్యకు సత్యము నిల్చునంట

2.అతత మద్వియోగ జనితార్తి దపించుచు మృత్యువొంది,

3.ఇనకుల వర్య తాదొలుత నిచ్చేదనంచు వచించి, గానం.వీరభద్రరావు

4.ఈ సమరంబులో ననుజు డీల్గెను నాకు సహాయమొంచి...

5.ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కాపుల గూడి, గానం.ముసునూరి సూర్యనారాయణ

6.ఏనగ గహ్వరంబులమరే ధను జాంతికమందు గాకయే, గానం.ముసునూరి సూర్యనారాయణ

7.ఓరీ నీచనరాధమా వినుము శౌర్యోత్సహ గంభీర, గానం.ఎస్.వి.కృష్ణమాచారి

8.కనుగొంటిని కనులార జానకిని లంకాద్వీపముందున్న, గానం.ముసునూరి సూర్యనారాయణ

9.కూకటి ముడికినై కురులు గూడనినాడే బెదరక, గానం

10.ఘన గుణశాలి ప్రాణములకంటే బ్రయుండగు, గానం.సుబ్బారావు

11.చవిచూపెద నా భుజబలంబు భందించెద, గానం.శంకరరావు

12.చారు కులాభిమానమున సన్నుత ధర్మము

13.చించెద దైత్యసంఘముల చిందర వందర చేసి బ్రహ్మ

14. చెరనిడి నీమధం బడగజేసిన యర్జును వేయి చేతులన్, గానం.నరసింహం

15.జనపతి సత్యవాదియను సత్య విచారుడు గాన,

16.నీదగు రాజ్యలక్ష్మి ధరణీవర యేను భరింపజాల,

17.నీల మేఘచ్చాయ బోలు దేహమువాడు ధవలాబ్దపత్ర, గానం.ముసునూరి సూర్యనారాయణ

18.పడతిరో యెంత నన్నిగిలిపల్కిన నిప్పుడు నిన్ను జంపక

19.పన్నగ సీతమ్మను భర్త కొసంగి సుఖింపుమట్ల్లు గాకున్న, గానం.భానుమూర్తి

20.పవలు సమస్త వన్యఫల వర్తకుల దెచ్చి యోసంగుచు,

21.పావనమూర్తి రామ నరపాలకు పంపున నబ్ధి , గానం.ముసునూరి సూర్యనారాయణ

22.భానుకులోత్తంస వందితామరలోక జానకీనాయకా, గానం.భానుమూర్తి

23.భీమాటోప భుజప్రతాప మహిమన్ భీమాచలంబెత్తి, గానం.ఎస్.వి.కృష్ణమాచారి

24.భూరి భుజప్రతాపమున బొంగుచు నిర్జరకోటీ మాటికిన్,

25.రామున్ పుణ్యగుణాభిరాము నెలమిన్ ప్రార్థించి,

26.రావణా సీతనిచ్చి యపరాధిని శరణంబు నొందితిన్, గానం.నరసింహం

27.వినుడిదే నాదుపల్కుపృద్విపతులారా భవుండు, గానం.సత్యనారాయణ

28.విశృతకీర్తియైన పృధ్వీసుత దేవనరాహి రాజిలో, గానం.జగన్నాథరావు

29.సతతము దల్లినట్లు బలు చందములన్నిను గోల్చు, గానం.సుబ్బారావు

30.సరస మనోరదాధి గమశాలి విభీషణు భార్యయైన, గానం.వెంకటలక్ష్మి

31.సుధతీ యెటులన్ భరియేంతువోకదా ఏగతి బాముల,

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.