సకినాలు, తెలంగాణ రాష్ట్రంలో తయారుచేసే ఒక పిండి వంటకం (స్నాక్). బియ్యం పిండితో వృత్తాలుగా చేసి నూనెలో వేయిస్తారు.[1][2] తెలంగాణ పల్లెల్లో మకర సంక్రాంతి పండుగ సమయంలో ఈ వంటకాన్ని తయారుచేస్తారు.[3] ఇవి చాలారోజులు నిల్వ ఉంటాయి.

సకినాలు
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంతెలంగాణ
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు బియ్యం పిండి
పెద్ద సకినం

ప్రాముఖ్యత మార్చు

శుభకార్యాలలో తయారు చేసుకునే పిండివంటలలో సకినాలు మొదటిస్థానంలో ఉంటాయి. వధువు తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు పంపిణీ చేయడానికి వరుడి తల్లిదండ్రులకు ఇచ్చే అయిదు సారె బుట్టలలో ఒకటి సకినాల బుట్ట కూడా ఇస్తారు.[4] జనవరిలో‌ విపరీతంగా ఉన్న చలి కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి జబ్బుల నుండి ఉపశమనానికి సకినాలలో వేసిన ఓమ, అధిక చలి బాధ తగ్గించుకోవడానికి నువ్వులు ఒంటికి వెచ్చదనం ఇస్తాయి. అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు. సకినాలు తయారుచేసే సమయంలో తొలి పెద్ద సకినము మధ్యలో గౌరమ్మను పెట్టి గౌరీ పూజ చేస్తారు.

కావలసినవి మార్చు

బియ్యపు పిండి, మసాలా దినుసులు, నువ్వుల గింజలు, వాము గింజలు, ఉప్పు, నూనె మొదలైన వాటితో తయారు చేస్తారు.

పద వివరణ మార్చు

చకినము అంటే చక్రం లేదా వృత్తం అని అర్ధం. "సకినాలు" అనే పదం "చకినము" అనే పదం నుండి ఉద్భవించిందని కొందరి అభిప్రాయం. మకర సంక్రాంతి సమయంలో కొత్త వరి పంట పండించినప్పుడు రైతులు ఈ సంప్రదాయ పండుగ వంటకాలను తయారుచేసుకుంటారు. మూడు చుట్లతో ఈ సకినాలను చుడుతారు. ఇంటి ఆచారాన్ని బట్టి చుట్టల సంఖ్య పెరగడం, తగ్గడం ఉండవచ్చు.[5]

గుర్తింపు మార్చు

తెలంగాణ సంప్రదాయ పండుగ వంటకాల్లో ఇదీ ఒకటిగా గుర్తింపు పొందింది.

మూలాలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "Students celebrate 'Sankranti Sambaralu'". The Hindu. 2011-01-01. Archived from the original on 3 January 2014. Retrieved 8 September 2021.
  2. "BJP women add festive flavour to protest". The Hindu. 2011-01-14. Archived from the original on 21 September 2011. Retrieved 8 September 2021.
  3. "Telangana supporters stage 'rasta rokos'". The Hindu. Retrieved 8 September 2021.
  4. "Trailing the Andhra food route". Times of India. Retrieved 8 September 2021.
  5. టివి9 తెలుగు, తెలంగాణ (3 March 2021). "Telangana Femous Sakinalu: తెలంగాణ ఫేమస్ 'సకినాలు'.. ఇలా చేస్తే రుచికరంగా వస్తాయటా... మీరు ట్రై చేయండి..." రజిత చంటి. Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సకినాలు&oldid=3907078" నుండి వెలికితీశారు