సగటు మనిషి
సగటు మనిషి 1988 లో విడుదలైన తెలుగు సినిమా. టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ పతాకం కింద యం.నాగేశ్వరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, శరత్ బాబు, లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చక్ర సంగీతాన్నందించాడు.[1]
సగటు మనిషి (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎమ్.సుబ్బయ్య |
---|---|
తారాగణం | చంద్రమోహన్, శరత్ బాబు, సీత |
సంగీతం | కృష్ణ చక్ర |
నిర్మాణ సంస్థ | టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బడుగువర్గాల అభ్యున్నతికి తోడ్పడే చిత్రాలు తీసి అమరుడైన టీ. కృష్ణ స్మృత్యర్థం నెలకొల్పిన 'టి. కృష్ణ మెమోరియల్ ''పిక్చర్స్' అనే సంస్థ నిర్మించిన ఈ 'సగటుమనిషి' చిత్రంలో ప్రధానంగా తీసుకున్న పాత్ర మునిసిపాలి టీలో పనిచేసే ఒక సామాన్య గుమస్తా. ఇతన్ని కేంద్రంగా తీసుకుని ఇతని చుట్టూ అనేక సగటుమ నిషి పాత్రలు కూడా సృష్టించడం జరిగింది.
నటీనటులు
మార్చు- చంద్రమోహన్,
- శరత్బా బు,
- ప్రదీప్ శక్తి,
- రాళ్ళపల్లి,
- వేలు,
- చలపతి రావు,
- నర్రా వెంకటేశ్వరరావు,
- సాయిచంద్,
- సీత,
- కల్పన,
- నిర్మల,
- మమత తదితరులు.
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: యం.వి.యస్. హరనాథరావు;
- పాటలు: గుండవరపు సుబ్బారావు, అదృష్టదీపక్, నాజర్, దేవవ్రత్;
- సంగీతం: కృష్ణచక్ర;
- ఛాయాగ్రహణం: ఆర్. రామారావు;
- నిర్మాత: యం. నాగేశ్వరరావు;
- స్క్రీన్ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య.
మూలాలు
మార్చు- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-05-31.