సచిన్ బన్సల్
సచిన్ బన్సల్ ఒక భారతీయ వ్యాపారవేత్త. భారత ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు.[2][3][4] ఫ్లిప్‌కార్ట్ లో ఉన్న 11 సంవత్సరాలు సచిన్ ఆ సంస్థకు ఛైర్మన్, సీఇవో గా ఉన్నాడు. 2018లో ఫ్లిప్‌కార్ట్ ను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజమైన వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు.[5][6]
సచిన్ బన్సల్ | |
---|---|
జననం | చండీఘర్ | 1981 ఆగస్టు 5
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఐఐటీ ఢిల్లీ |
వృత్తి | వ్యాపారవేత్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్, సియిఓ |
నికర విలువ | 1.2 బిలియన్ డాలర్లు (జనవరి 2021)[1] |
జీవిత భాగస్వామి | ప్రియ బన్సల్ |
2007 సంవత్సరంలో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ (బంధువులు కాదు) కలిసి ఫ్లిప్‌కార్ట్ ను స్థాపించారు. 2018 నాటికి ఆ సంస్థ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్పటికి బన్సల్ కు ఆ సంస్థలో 5.5 శాతం వాటా ఉంది. దాన్ని వాల్‌మార్ట్ కు విక్రయించాడు. అతని ఆస్తుల విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు అయ్యింది.
మూలాలు
మార్చు- ↑ Ganjoo, Shweta (May 10, 2018). "Flipkart-Walmart deal: Sachin Bansal gets over Rs 6700 crore and leaves company, Binny Bansal staying back". India Today. New Delhi. Retrieved April 8, 2019.
- ↑ "ET Awards 2012-13: How IIT-alumnus Sachin Bansal built Flipkart into a big online brand". The Economic Times. ET Bureau. September 26, 2013. Retrieved April 8, 2019.
- ↑ "Sachin Bansal, Binny Bansal". CNBC. October 6, 2014. Retrieved April 8, 2019.
- ↑ "Meet the 9 richest Indian tech billionaires". The Economic Times. Retrieved 2020-09-29.
- ↑ Nair, Radhika (August 9, 2013). "Do not start alone, find a co-founder: Sachin Bansal, Flipkart". The Economic Times. Retrieved April 8, 2019.
- ↑ "Sachin Bansal quits Flipkart as Walmart wanted only one founder on board". The Economic Times. May 10, 2018. Retrieved April 8, 2019.