సత్యవంత్ మల్లన్న

డాక్టర్ ఎస్.మల్లన్న 20వ శతాబ్దపు తొలి దశకాల్లో హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు. మల్లన్న పేద కుటుంబంలో నుండి వచ్చి ప్రపంచ ప్రసిద్ధ పాథాలజిస్ట్ స్థాయికి ఎదిగాడు.[1]

మల్లన్న ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఇండోరు సమీపంలోని మౌలో జన్మించాడు. ఎఫ్.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత వైద్య కళాశాలలో చేరాడు. ఈయన షోలాపూరుకు చెందిన ప్రముఖ వైద్యుని కూతురు అహల్యా కల్వాకర్ ను పెళ్ళిచేసుకున్నాడు.[2] వీరి సంతానమే భావి భారత సైనికదళాధిపతి సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్. 1895 హైదరాబాదు క్లోరోఫార్ం కమీషను కాలంలో హైదరాబాదు వైద్య కళాశాల ప్రిన్సిపాలు ఎడ్వర్డ్ లారీతో పాటు ఇంగ్లాడుకు వెళ్ళాడు.[3] 1894లో లారీతో పాటు ఇంగ్లాండు వెళ్ళిన విద్యార్ధులలో, ముత్యాల గోవిందరాజులు నాయుడు, మహమ్మద్ అబ్దుల్ ఘనీ కూడా ఉన్నారు.[4] ఆ తర్వాత మల్లన్న నిజాం ప్రభుత్వ స్కాలర్‌షిఫ్ పొంది, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించాడు. ఈయన జర్మనీకి వెళ్ళి రాబర్ట్ కాక్ వద్ద బాక్టీరియాలజీలో శిక్షణ పొంది, సూక్ష్మజీవశాస్త్రంలోని నూతన విజ్ఞానాన్ని హైదరాబాదుకు తెచ్చాడు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Pingali, Jaganmohan Reddy (2000). Down memory lane: the revolutions I lived through. Booklinks. pp. 36–37. Retrieved 22 November 2017.
  2. S. A., Husain (1985). "PHYSICIANS OF HYDERABAD DURING NIZAM IV, V & VI" (PDF). Bulletin of Indian Institute of History of Medicine (XV): 67–68. Retrieved 22 November 2017.
  3. K. S. S., Seshan. "Mahboob Ali Pasha: Legend with a lavish lifestyle". The Hindu. No. February 02, 2017. Retrieved 22 November 2017.
  4. K., Chandraiah (1998). Hyderabad, 400 Glorious Years. Hyderabad: K. Chandraiah Memorial Trust. p. 221. Retrieved 22 November 2017.