సత్యవతి (ఋచీకుడి భార్య)
సత్యవతి (ఋచీకుడి భార్య) కథ గాధి అనే రాజుతో మొదలవుతుంది. జహ్ను వంశం లేదా కుశిక వంశం రాజు అయిన గాధికి ఒక అందమైన, తెలివైన కుమార్తె సత్యవతి ఉంది.
వివాహముసవరించు
ఒకనాడు పని మీద రాజు గారి దగ్గరకు వెళ్ళిన ఋచీక మహర్షి అక్కడ ఉన్న అందాలరాశి సత్యవతిని చూసి పరవశించి, బ్రహ్మచర్యం పాటిస్తూ తపోదీక్షలో ఇంతకాలము ఉన్ననూ, ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై, మనసు సత్యవతి యందే లగ్నమొనర్చి, ఆమెనే వివాహమాడ నిశ్చయిచుకొని, తన మనసులోని ఆంతర్యాన్ని గాధికి విశదపరచి, సత్యవతిని తనకిచ్చి వివాహము జరిపించమని కోరతాడు.
సంతానంసవరించు
ఒక ముసలి బ్రాహ్మణుడు అయిన ఋచీక మహర్షితో భార్య పేరు సత్యవతి (ఋచీకుడి భార్య) కి వివాహం జరిగింది. సత్యవతి (ఋచీకుడి భార్య) తండ్రి గాధి రాజు. గాధి తండ్రి కుశనాభుడు, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. ఋచీక మహర్షి దంపతులకు పుట్టిన కుమారుడు జమదగ్ని మహర్షి.
విశ్వామిత్రుడు - పరశురాముడుసవరించు
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది[1]. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు[2]. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, విష్ణువు యొక్క ఆరవ అవతారం అయిన గొప్ప యోధుడు, ఋషి అయిన పరశురాముడు నకు సంబంధించినంత వరకు చాలా దగ్గర బంధుబాంధ్యవం ఉంది.
పరశురాముని జన్మవృత్తాంతంసవరించు
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.[3] ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు.[4] ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు[3]. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
మూలాలుసవరించు
- ↑ Shahjahanpur – Etihasik Evam Sanskritik Dharohar
- ↑ Pai, Anant (November 29, 2010). Parashurama – Sixth Incarnation of Vishnu. Amar Chitra Katha – Volume 764. p. 33.
- ↑ 3.0 3.1 Rai, Kayyara Kinhanna (June 13, 2010). BhargavaParashurama. Litent ePublishing. p. 33.
- ↑ "Parashurama". Rai, Kayarra Kinhanna. November 22, 2012. Archived from the original on 2012-04-28. Retrieved November 22, 2012.