సత్యవోలు సోమసుందరకవి
సత్యవోలు సోమసుందరకవి శతక కవి. అతను అనేక శతకాలను రాసాడు.[1]
జీవిత విశేషాలు
మార్చుఈ కవి తల్లిదండ్రులు వెంకటరాయుడు, రామాంబ. అతని తాత సోమరాజుకు మంత్రిగా ఉండేవాడు. అతని గురించి అతను రాసిన "మహేంద్రవిజయం"లో పద్య రూపంలో గలదు.
సీ.ఘన సాహసౌదార్య గాంభీర్య నిధిసోమ
రాణ్మంత్రి, యే కవి రాజు తాత
నయగుణ విద్యా వినయశాలి వెంకట
రాయు, డే సత్కవి రాజు తండ్రి
సద్గుణ సంతాన సంతాన వల్లి యౌ
రామాంబ, యేకవి రాజు తల్లి
రావు వెంకటజగ్గ రాయాహ్వయ మహీత
లేంద్రు, డే కవిరాజు నేలు రాజు
గీ.అట్టి శ్రీ సత్యవోలు వంశాబ్ధి చంద్రు
సతత సంగీత సాహిత్య సత్కవిత్వ
సరస మతిసాంద్రు సోమ సుందర కవీంద్రు
నను నయకదంబ జగదంబ మరుచుగాత
అతను సంగీత సాహిత్యములందు అసమాన ప్రతిభ కలిగి, వచనాంధకాదంబరి వంటి రచనలు చేశాడు. ఇతని కవితాధార ప్రాచీన ప్రబంధముల వలె మృదు మధురమైనది. వీరు రాజా రావు వేంకట జగ్గారాయణంగారి అస్థానపండితులుగా ఉన్నాడు. అతను 33 గ్రంథములు రచించిరి. అతనికి ఆరుగురు కుమారులు. అతని ఐదవ కుమారుడు సత్యవోలు రాధామాధవరావు సంగీత సాహిత్య విద్వాంసుడు.
అతను 1926వ సంవత్సరమున కీర్తిశేషులైరి.
రచనలు
మార్చుముద్రిత రచనలు
మార్చు- ఆంధ్రపండితరాయ శతకం
- జగదంబా నారద ప్రసంగం
- లోకోక్తి ముక్తావళీ
- చమత్కార రసమంజరి
- సూక్తి ముక్తావళి
- అహింసా ప్రబోధిని
- గోపాల శతకము
- రాజశేఖరశతకము
- వచనాంధ్ర కాదంబరి (నాటకం)
- రాధామాధవ విలాసము
- శ్రీమదాంధ్ర చంపూ భాగవతం.
- మహేంద్ర విజయము (నాటకం) [2] (1888)
- రతిమన్మధ నాటకం
- సంగీత పార్వతీ పరిణయము[3]
అముద్రిత రచనలు
మార్చు- రుక్మిణీ పరిచయం
- విక్రమార్క చరిత్ర
- శ్యామలాంబ శతకం
- సంగీత సార సంగ్రహం
- జగ్గరాయ భూప శతకం
- చాటుధారా సుధాంబుధి
పద్యములు
మార్చురాజశేఖర శతకంలో
మార్చుతనువు మనంబు ప్రాణములు దద్దయు నింద్రియ జాలమైక్యము
న్దనరగ జేసి భక్తిగొని తావక పాదసరోజ చింతనం
బున గడు మోదమొందు ఘనపుణ్యుడొనర్చి న సర్వధర్మముల్
బొనరగనీకొసంగుచునుబొందు భవద్గతిరాజశేఖరా!
రాధామాధవ విలాసములో
మార్చుకమ్మతావులనీను కస్తూరి తిలకంబు
మోము చందురు నందు ముద్దుగుల్కఁ
గోటి సూర్యప్రభన్ నీటు మీఱెడు తేజు
గల కౌస్తుభంబు వక్షమునఁ గ్రాల
నమృతబిందువు లీల నలరుచుండెడు నాణి
ముత్తెంబు నాసాగ్రమునను వ్రేల
దరమధ్యముననుండి ధారగాఁ బడురీతి
నల ముత్తెముల సరు లఱుత మెఱయఁ
గరజలజముల రత్నకంకణము లలరఁ
దనువు నెల్లెడ రక్తచందనము దనర
మురళిఁబాడుచు నాడెడు పుణ్యశీలు
భక్తపరిపాలు వేణుగోపాలుఁగంటి
మూలాలు
మార్చు- ↑ సత్యవోలు సోమసుందరకవి (1935). శ్రీమదాంధ్రచంపూ భాగవతము.
- ↑ https://archive.org/details/in.ernet.dli.2015.331477/page/n7/mode/2up
- ↑ సత్యవోలు సోమసుందరకవి (1941). మహేంద్ర విజయము.