సన్నుతి సేయవె మనసా (పాట)

సన్నుతి సేయవె మనసా 1957 సంవత్సరంలో విడుదలైన పాండురంగ మహత్యం చిత్రంలో నాగయ్య స్వయంగా నటిస్తూ పాడిన పాట. ఈ పాటకి సంగీతం అందించింది టి.వి.రాజు, సాహిత్యం అందించింది సముద్రాల జూనియర్.

విశేషాలు మార్చు

సహాయపాత్రలు వేయడం మొదలు పెట్టిన తరువాత నాగయ్య పాడిన కొద్ది పాటల్లో ఇది ఒకటి. పాట మొత్తం ప్రశాంతంగా సాగుతుంది. నాగయ్య, ఎన్.టి.రామారావు, ఋష్యేంద్రమణి, పద్మనాభం మీద ఈ పాటను చిత్రీకరించారు. ఆదిదేవుని మీద మనసుని కేంద్రీకరించమనే ఉపదేశంగా సాగుతుందీ పాట.

పాట మార్చు

సన్నుతి సేయవె మనసా

ఆపన్న శరణ్యుని హరిని

సన్నుతి సేయవె మనసా

ఆపన్న శరణ్యుని హరిని

సన్నుతి సేయవె మనసా

చక్రధారి కౌస్తుభహారి

చక్రధారి కౌస్తుభహారి

పాపహారి కృష్ణమురారీ

పాపహారి కృష్ణమురారీ

సన్నుతి సేయవె మనసా


మరులు గొలిపే సిరులు మేను

నిలువబోవే మనసా

మరులు గొలిపే సిరులు మేను

నిలువబోవే మనసా

స్థిరముగానీ ఇహభోగముల

పరము మరువకె మనసా

గోపబాలుని మురళీలోలుని

గోపబాలుని మురళీలోలుని

సన్నుతి సేయవె మనసా

చక్రధారి కౌస్తుభహారి

చక్రధారి కౌస్తుభహారి

పాపహారి కృష్ణమురారీ

పాపహారి కృష్ణమురారీ

సన్నుతి సేయవె మనసా


ఆదిదేవుని పాదసేవే

భవపయోధికి నావ

ఆదిదేవుని పాదసేవే

భవపయోధికి నావ

పరమయోగులు చేరగగోరే

పరమపదవికి దోవ

శేషశాయిని మోక్షాదాయిని

శేషశాయిని మోక్షాదాయిని

సన్నుతి సేయవె మనసా

ఆపన్న శరణ్యుని హరిని

సన్నుతి సేయవె మనసా

చక్రధారి కౌస్తుభహారి

చక్రధారి కౌస్తుభహారి

పాపహారి కృష్ణమురారీ

పాపహారి కృష్ణమురారీ

కృష్ణమురారీ కృష్ణమురారీ

కృష్ణమురారీ కృష్ణమురారీ

కృష్ణమురారీ


లింకులు మార్చు