సఫియ్యా బింత్ హుయాయ్

సఫియ్యా బింత్ హుయాయ్ : (Arabic: صفية بنت حيي‎) (c. 610 – c. 670) ముహమ్మద్ ప్రవక్త గారి భార్య. ప్రవక్త యొక్క అందరి భార్యలవలె ఈవిడకి కూడా "విస్వాసుల యొక్క తల్లి" అనే బిరుదు ఉంది. బను నాదిర్ అనే యూదు తెగకు చెందిన వనిత. యుద్ధంలో బానిసగా పట్టుబడిన ఈవిడని ముహమ్మద్ ప్రవక్త భార్యగా స్వీకరించారు. ప్రవక్త మరణాంతరం, ఇస్లాం రాజకీయాలలో ప్రముఖపాత్ర పోషించారు.

ప్రారంభ జీవితం మార్చు

సఫియ్యా బనునాదిర్ అనే యూదు తెగ నాయకుడైన హుయాయ్ ఇబ్న్ అక్తబ్ యొక్క కుమార్తె. తల్లి బర్ర బింత్ సమావల్ బను కురేజా తెగకు చెందిన వనిత. చరిత్ర ఆధారం ప్రకారం, ఈమె వివాహం సల్లం ఇబ్న్ మిష్కంతో జరిగి తరువాత ఇరువురు విడాకులు తీసుకున్నారు.[1]

సా.శ. 625 లో మదీనా నుండి బను నాదిర్ తెగను వేలివేయడంతో, తన కుటుంబం మదీనా దగ్గర ఖైబర్ అనే ప్రాంతంలో ఒక ఒయాసిస్ వద్ద స్థిరాపడ్డారు.[1] తండ్రి, సోదరుడు మక్కన్, బెడోవిన్ దళాలతో కలిసి ప్రవక్త పై కందక యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ఈ యుద్ధంలో మక్కన్లు వెనుతిరగడంతో బను కురేజా తెగవారు యుద్ధంలో పట్టుబట్టారు.

సా.శ. 627 లేదా 628 లో సఫియ్యా వివాహం రెండవసారి బను నాదిర్ యొక్క కోశాదికారి అయిన కెనాన్ ఇబ్న్ అల్ రబీతో జరిగింది. అప్పుడు తన వయస్సు 17.[1] సఫియ్యా ఒకరోజు ఆకాశం నుండి చందమామ రాలి తనవడిలో పడినట్టు కలగన్నారు. అయితే ఈ విషయం తన భర్తతో చెప్పగా అయన ఈ కల సారంశం తన వివాహం తిరిగి గొప్ప యోదునితో అవుతుంది అని ఆగ్రహించి ముఖంపై చేయిచేసుకున్నారు, ఫలితంగా ముఖంపై ఒక ఘాటు పడింది. ప్రవక్త మొదటిసారి సఫియ్యాను చూసిన మొదటిసారి అడుగగా సఫియ్యా తనకలను, జరిగిన ఉదంతాన్ని వివరిచారు.[2][3]

ఖైబర్ యుద్ధం మార్చు

మే 629 లో ముస్లిం సైన్యం వద్ద (బనూ నాదిర్ సహా) అనేక యూదు తెగలను ఖైబర్ యుద్ధంలో ఓడించారు. యూదులు లొంగిపోయారు, వారి వార్షిక ఉత్పత్తిలో సగం ఇచ్చే షరతు మీద ఖైబర్ లో ఉండేందుకు అనుమతి పొందారు. ఖైబర్ ప్రాంతం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది.[4] యుద్ధ బందీగా దియ ఇబ్న్ ఖలీఫా ఉన్న సఫియ్యాను ప్రవక్త భార్యగా స్వీకరించారు.[4]

ప్రవక్తతో వివాహం మార్చు

మొదటిలో ప్రవక్త అనుచరులు సఫియ్యాను భార్యగా పరిగణించాల లేదా బందీగా పరిగణించాలా అని మదనపడ్డారు.అయితే ప్రవక్త సఫియ్యాను ఇస్లాం స్వీకరించ మనటంతో అనుచరులు భార్యగా పరిగణించి "విస్వాసుల తల్లి"గా గౌరవించారు. సఫియ్యాకు పిల్లలు పుట్టలేదు.[5]

ఇస్లాం స్వీకరించినప్పటికీ, ప్రవక్త భార్యలు సఫియ్యా యొక్క యూదు మూలాలను ఆటపట్టిస్తూ ఉండేవారు. అంతే కాకుండా ఇస్లాం పట్ల తన విధేయతను శంకించారు, యుద్ధంలో తన కుటుంబసభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటుంది అని అనుమానపడేవారు.[6] ఈ అనుమానాల పట్ల ప్రవక్త, ఉమర్ అసంతృప్తి ప్రకటించి ఇస్లాం పట్ల సఫియ్యా విధేయత స్వచ్ఛమైనదిగా ప్రకటించారు.[1][2]

సఫియ్యా యూదు మూలాలను గురుంచి మాట్లాడుతూ ప్రవక్త ఇలా అన్నారు "నీ పట్ల ఎవరైనా వివక్ష చూపితే నీ భర్త ముహమ్మద్ ప్రవక్త అని, నీ తండ్రి ప్రవక్త అరాన్ అని, బాబాయి ప్రవక్త మూసా అని ఈ విషయంలో నువ్వు వాళ్ళకన్నా గోప్పదానివి అనిచెప్పు".[2]

ప్రాముఖ్యత మార్చు

సా.శ. 656 లో సఫీయ్యా ఖలీఫాగా ఉత్మాన్ ఇబ్న్ అఫ్ఫన్ ను బలపరిచారు. ఖలీఫా నిర్బంధంలో ఉన్నకాలంలో ఉత్మాన్ కు తన నివాసం, ఉత్మాన్ నివాసం మధ్యలో ఉన్న చిన్న ద్వారం ద్వారా ఆహారం అందించారు.[1]

670 లేదా 672 లో మువయ్యా ఖలీఫాగా ఉన్నకాలంలో మరణించారు. మృతదేహాన్ని జన్నత్ అల్ బకిలో చేశారు.[7] మరణించేనాటికి తనవద్ద 100,000 దిర్హంల ఆస్తి ఉండేది. వీలునామా ప్రకారం మరణాంతరం ఇందులో ముడువంతులు తన చెల్లెలి యొక్క కొడుకుకు చెందింది. ఖలీఫా మువయ్యా తన నివాసాన్ని 180,000 దిర్హాలు పెట్టి ఖరీదు చేసారు.

తన కలను అందరు అద్భుతంగా పరిగణించారు. తన వ్యధ, బాధలు సూఫీలపై ప్రభావం చూపాయి. సఫియ్యా వివరించిన ప్రవక్త సంప్రదాయాలు అన్ని హదిత్ లలో స్థానంపొందాయి. తన జీవితంలోని చాలా సంఘటనలు తరువాతి కాలంలో ఇస్లామిక్ న్యాయలో అంశాలు పరిశీలించాటానికి చాలా ఉపయోగపడ్డాయి.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Vacca, V (1995). "Safiyya". In P. J. Bearman, Th. Bianquis, C. E. Bosworth, E. van Donzel and W. P. Heinrichs (ed.). Encyclopaedia of Islam. Vol. 8 (2nd ed.). Brill Academic Publishers. p. 817. ISBN 9004098348. ISSN 1573-3912.{{cite encyclopedia}}: CS1 maint: multiple names: editors list (link)
  2. 2.0 2.1 2.2 Stowasser, Barbara. The Mothers of the Believers in the Hadith. The Muslim World, Volume 82, Issue 1-2: 1-36.
  3. "It is related that she bore the mark of a bruise upon her eye; when the Prophet (Peace be upon him) asked her tenderly the cause, she told him that, being yet Kenāna's bride, she saw in a dream as if the moon had fallen from the heavens into her lap; and that when she told it to Kenāna, he struck her violently, saying: 'What is this thy dream but that thou covetest the new king of the Ḥijāz, the Prophet, for thy husband!' The mark of the blow was the same which Moḥammad saw." cf. Muir (1912) pp. 378-379
  4. 4.0 4.1 Veccia Vaglieri, L. "Khaybar". In P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs (ed.). Encyclopaedia of Islam Online. Brill Academic Publishers. ISSN 1573-3912.{{cite encyclopedia}}: CS1 maint: multiple names: editors list (link)
  5. Peters, F. E., Muhammad and the Origins of Islam, State University of New York Press, 1994, pp.179, ISBN 0-7914-1876-6. "At Medina he also married Umar's daughter Hafsa, Hind, Zaynab daughter of Jahsh, 16 Umm Salama, Juwayriyya, Ramla or Umm Habiba, Safiyya, and Maymuna. None of them bore him children, however, though he had a son, Ibrahim, by his Coptic concubine Maria. Ibrahim died an infant."
  6. Abu Dawud vol.3 no.4588 p.1293
  7. Al-Shati', 1971, p. 181