సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనగా ఒక జిల్లా ప్రధాన పరిపాలనా అధికారి హోదా. కొన్నిదేశాలలో ప్రభుత్వ నిర్మాణాన్ని బట్టి జిల్లా స్థాయి కంటే తక్కువగా కూడా వుండవచ్చు.

భారతదేశంలో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు కార్యనిర్వాహక, న్యాయపరమైన (మెజిస్టీరియల్) అధికారాలున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్ జిల్లాకు ప్రధాన పరిపాలనాధికారి కాగా, ఉపవిభాగమైన రెవెన్యూ డివిజన్కు ప్రధాన అధికారిని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డిఒ) అని అంటారు. ఈ హోదాకు సబ్ కలెక్టర్, డిప్యూటి కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. వీరు ఐఎఎస్ కు చెందిన వారైవుంటారు. ఐఎఎస్ ఎంపిక, శిక్షణ తరువాత తొలి ఉద్యోగం ఇదే.[1]

విధులు మార్చు

రెవెన్యూ విధులు మార్చు

  • భూమి రికార్డుల నిర్వహణ, రెవెన్యూ కేసుల విచారణ, సరిహద్దు, ఉత్పరివర్తనలు, పరిష్కార కార్యకలాపాలు
  • ప్రభుత్వ భూమి యొక్క సంరక్షకుడిగా పనిచేయడం
  • రోజువారీ రెవెన్యూ పనులకు బాధ్యత వహించే తహసీల్దారుల పనిపై పర్యవేక్షణ

మెజిస్టీరియల్ విధులు మార్చు

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల అధికారాలు సబ్ డివిజనల్ న్యాయాధికారులకు వుంటాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని నేరాల నివారణ విభాగాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. ఇంకా వివాహం అయిన ఏడు సంవత్సరాలలోపు మహిళల అసహజ మరణాల కేసులలో విచారణలు చేయటం అవసరమైతే కేసు నమోదు కోసం పోలీసులకు ఆదేశాలు జారీ చేయగలరు.

పోలీస్ లాక్ అప్, జైళ్లు, ఉమెన్ హోమ్స్ మొదలైన వాటిలో మరణాల విచారణ జరిపే అధికారం ఉంది. ఈ విభాగం అధికారులు కూడా ప్రభుత్వ కళ్ళు, చెవులుగా వ్యవహరిస్తారు. అగ్నిప్రమాదాలు, సంఘటనలు, అల్లర్లు, ప్రకృతి వైపరీత్యాలతో సహా అన్ని పెద్ద ప్రమాదాలపై విచారణ జరిపే ఆధికారంకూడా వుంటుంది.

విపత్తు నిర్వహణ మార్చు

సహజమైన లేదా మానవ కారకమైన ఏదైనా విపత్తులో ఉపశమనం, పునరావాస కార్యకలాపాలకు ప్రాథమిక బాధ్యత వుంటుంది. ప్రకృతి, రసాయన విపత్తుల కోసం విపత్తు నిర్వహణ ప్రణాళికను సమన్వయం చేయడం, అమలు చేయడం కూడా ఇంకొక బాధ్యత.

ఇవి కూడ చూడు మార్చు

  • పరిపాలనా విభాగం

మూలాలు మార్చు

  1. "రెవెన్యూ విభాగాలు". Telangana Government. Retrieved 2021-02-01.