సమకాలీకరించబడిన ఈతను ఇంగ్లీషులో సిన్కర్నైజ్డ్ స్విమింగ్ (Synchronized swimming) అంటారు. దీనిని కుదించి తరచుగా సిన్క్రో (Synchro) అంటారు. ఈతగాళ్లు ఒంటరిగా కాని, జంటగా కాని, కొంతమంది కలిసి గాని లేక కొన్ని జట్లుగా కాని నీటిలో లయబద్ధంగా ఈత కొడుతూ సంగీతానికి అనుగుణంగానృత్యం చేస్తూ లేక జిమ్నాస్టిక్స్ చేస్తూ అందరు ఒకే విధంగా చేయడాన్ని సమకాలీకరించబడిన ఈత అంటారు. ఇలా చేయడానికి స్విమ్మర్స్ కి ఎంతో నైపుణ్యం, బలం, ఓర్పుతో పాటు కఠోర సాధన చేయవలసి ఉంటుంది. జట్టులోని సభ్యుల మధ్య సఖ్యత, దయ చాలా అవసరం. అలాగే అసాధారణ శ్వాస నియంత్రణ కలిగి ఉండాలి. కొన్ని సమయాలలో తలక్రిందులుగా నీటి అడుగున కొన్ని సెకన్ల పాటు ఉండవలసి ఉంటుంది ఇటువంటి సమయంలో శరీరం చాలా ఒత్తిడికి గురవుతుంది. కచ్చితమైన సయయాన్ని పాటిస్తూ నీటిలో వీరు చేసే విన్యాసాలు చాలా కళాత్మకంగా ఉంటాయి.

Synchronized swimming
Synchronized swimming - Russian team.jpg
Russian synchronized swimming team, May 2007
Highest governing bodyFédération Internationale de Natation (FINA)
Characteristics
CategorizationAquatics
OlympicPart of the Summer Olympic programme since 1984

ఒలంపిక్స్ క్రీడలలో ప్రత్యేక స్థానంసవరించు

రొటీన్సవరించు

ఇవి కూడా చూడండిసవరించు

ఈత

ఈత (వ్యాయామం)

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.