సమగ్ర చిత్రలేఖనం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి యూరప్, అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి, ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.