సమతామూర్తి శ్రీమద్రామానుజ స్పూర్తి కేంద్రం

సమతామూర్తి శ్రీమద్రామానుజ స్పూర్తి కేంద్రం జీవాప్రాంగణం, శ్రీరామనగరం, ముచ్చింతల్, శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలో చినజియ్యరు స్వామిచేస్థాపించబడి అభివృద్ధి పధంలో నడుస్తున్నది. ప్రతిప్రాణి దేవుని సంతానమే అయినపుడు హరిజన గిరిజన తేడలేకుండా మానవులంతా దేవుని కుటుంబములోనివారే, సహోదరులే! ఆదేవుని దర్శించి, తరించే అధికారం అందరికీ ఉంది, అంటూ సాధికారికంగ హరిజనులకు ఆలయప్రవేశం కలిగించిన కరుణాసాగరులు శ్రీరామానుజచార్యులవారు. "సువిశాలభూమండలంలో రుచిగలవారందరికీ నిస్సంకోచంగ మంత్రాన్నివ్వండి అంటూ ఆచార్య పరంపరను ఆదేశించి, తమే గోపురమెక్కి మంత్రాన్ని వెదజల్లిన సమతామూర్తి శ్రీరామానుజులు. ఆగురువు అవతరించి 2016 నాటికి వేయిసంవత్సరాలవుతున్న సందర్భంగా కృతజ్ఞతగ వెయ్యేండ్ల పండుగ తలపెట్టారు చినజియ్యరు స్వామి. ఈ స్పూర్తికేంద్రంలో 216 అడుగుల ఎత్తుండే శ్రీరామానుజుల లోహమయమూర్తి, సంచలనాత్మకములూ- స్పూర్తిదాయకములూ అయిన ఆయన జీవిత విశేషాల దర్శనము, 108 సుప్రసిద్ధవైష్ణవ దివ్యదేశాలూ ఒక్కచోటట్లుగ సుమారు రూ: 108 కోట్లతో ఏర్పడే ఈ నిర్మాణాలు ప్రారంబించారు. రామానుజుని కూర్చుని వుండే పంచలోహములతో నిర్మించబడుచున్న 216 అడుగుల ఈవిగ్రహం ప్రపంచములోనే ఎత్తయినది. 45 ఎకరాల విశాలమైన స్థలములో రూపురేఖలు దిద్దుకుంటున్నది.

శ్రీమద్ర్రామానుజులు

సమతామూర్తి విగ్రహావిష్కరణసవరించు

ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి 14, 2022 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ఈ ఆశ్రమం సిద్ధమవుతోంది. చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలలో శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.[1]

మూలాలుసవరించు

జీవప్రాంగణం శ్రీరామనగరం, ముచ్చింతల్, శంషాబాద్ నుండి సేకరించిన సమాచారం
  1. "సమతా స్ఫూర్తి.. యాగ వైభవ దీప్తి". EENADU. Retrieved 2022-01-13.