సమలంబ చతుర్భుజం
ఒక చతుర్భుజం లో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానిని ట్ర్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు.
లక్షణాలు
మార్చు- దీనిలో నాలుగు భుజాలుంటాయి.
- నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
- ఒక జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉండాలి.
- సమాంతరం గాని భుజాలపై గల ఆసన్నకోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది.
- ట్రెపీజియం నిర్మాణానికి నాలుగు స్వతంత్ర కొలతలు కావాలి.
- సమాంతర భుజాల మధ్య గల లంబ దూరాన్ని "ఎత్తు" అంటారు.
- సమాంతరంగా లేని భుజాలను "legs" అంటారు.
- సమాంతరంగా లెని భుజాల మధ్యబిందువులను కలుపు రేఖాఖండాన్ని "మధ్యగత రేఖ" అంటారు.
- మధ్యగత రేఖ పొడవు, ట్రెపీజియం ఎత్తు ల లబ్ధం ట్రెపీజియం వైశాల్యమవుతుంది.
- ప్రతి చతుర్భుజం ట్రెపీజియం లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని సమాంతర చతుర్భుజం, రాంబస్, చతురస్రం, దీర్ఘచతురస్రం లకు ఒకజత సమాంతర భుజాలు కలిగియున్నందువల్ల అవి ట్రెపీజియం లక్షణాలను సంతరించుకుంటాయి.
వైశాల్యము
మార్చుa, b లు ట్రెపీజియం లోని సమాంతర భుజాలైతే "h" అనునది ఎత్తు ఐతే ట్రెపీజియం వైశాల్యం ఈ క్రింది సూత్రం ద్వారా తెలుసుకొనవచ్చును.
ట్రెపీజియం వైశాల్యము=½ X ఎత్తు X సమాంతర భుజాల మొత్తము ట్రెపీజియం వైశాల్యము=½ h (a+b) |