సమస్తిపూర్
సమస్తిపూర్ బీహార్ రాష్ట్రం, సమస్తిపూర్ఒ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ పరిధిలోకి వస్తుంది. బుధి గండక్ నది పట్టణం గుండా ప్రవహిస్తుంది. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. హాజీపూర్ కేంద్రంగా ఉన్న తూర్పు మధ్య రైల్వేకు చెందిన ఐదు రైల్వే డివిజన్లలో సమస్తిపూర్ డివిజను ఒకటి. పాట్నా, కటిహార్ తరువాత ఉత్తర బీహార్‌లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో సమస్తిపూర్ జంక్షన్ ఒకటి. [3]
సమస్తిపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°51′47″N 85°46′52″E / 25.862931°N 85.781064°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మిథిల |
జిల్లా | సమస్తిపూర్ |
లోక్‌సభ నియోజకవర్గం | సమస్తిపూర్ |
శాసనసభ నియోజకవర్గం | సమస్తిపూర్ |
జనాభా (2011)[1] | |
• Total | 62,935 |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5.30 |
PIN | 848101 |
ప్రాంతపు కోడ్ | STD Code 06274 |
Vehicle registration | BR-33 |
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సమస్తిపూర్ జనాభా 62,935, వీరిలో 33,025 మంది పురుషులు, 29,910 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 8,252. సమస్తిపూర్‌లో అక్షరాస్యుల సంఖ్య 46,416, ఇది జనాభాలో 73.8%, పురుషుల అక్షరాస్యత 77.2%, స్త్రీల అక్షరాస్యత 69.9%. పట్టణంలో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 84.9%. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.9%, స్త్రీల అక్షరాస్యత 80.4%. షెడ్యూల్డ్ కులాల జనాభా 9,219, షెడ్యూల్డ్ తెగల జనాభా 249. 2011 నాటికి సమస్తిపూర్‌లో 12,062 గృహాలు ఉన్నాయి. [1]
రవాణా
మార్చురోడ్లు
మార్చుబీహార్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎస్‌ఆర్‌టిసి) పట్టణం నుండి పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లకు బస్సులను నడుపుతోంది.
రైలు
మార్చుసమస్తిపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ భారత రైల్వేల తూర్పు మధ్య రైల్వే జోన్‌లో భాగంగా ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని చాలా ప్రాంతాలకు రైళ్ళు నడుస్తున్నాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Samastipur". www.censusindia.gov.in. Retrieved 25 December 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 21 జనవరి 2021.
- ↑ Baranwal, Jigyasu. "Trains to SPJ/Samastipur Junction Station - 162 Arrivals ECR/East Central Zone - Railway Enquiry". indiarailinfo.com (in ఇంగ్లీష్). Retrieved 18 February 2019.