సమోవాలో హిందూమతం
సమోవాలో హిందూమతం కొద్దిపాటి స్థాయిలో ఉంది, ప్రధానంగా ఫిజీ నుండి వలస వచ్చిన వారే ఇక్కడి హిందువులు. ముస్లింల సంఖ్య మాదిరిగానే హిందువుల సంఖ్య కూడా పదేపదే హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. 2006 సమోవా జనాభా లెక్కల ప్రకారం 25 మంది హిందువులు ఉన్నారు. [1]
55% కంటే ఎక్కువ హిందువులు ఫలేటా వెస్ట్‌లో కేంద్రీకృతమై ఉన్నారు. [1]
జనాభా వివరాలు
మార్చుసమోవాలో హిందూమతం 20వ శతాబ్దం చివరలో ప్రారంభమైంది, అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా 100 లోపు ఉన్న హిందువుల్లో చాలా మంది వలస వెళ్ళారు. 2001 జనాభా లెక్కలలో హిందూమతం లేదు. బహుశా ఆ సమయంలో దానికి అనుచరులు ఎవరూ ఉండి ఉండరు (48). [1] 2006 జనాభా గణనలో హిందూమతాన్ని చేర్చారు. ఇందులో 25 మంది హిందువులు ఉన్నట్లు తేలింది. ఇందులో 12 మంది పురుషులు 13 మంది మహిళలు ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్నందున, ముస్లిం, హిందూ జనాభా గణన 2011 జనాభా లెక్కల ప్రకారం విలీనం చేయబడింది. అప్పుడు మొత్తం సంఖ్య 38. [1] ఆ 38 మందిలో 25 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు. 2009 నాటి సమోవా భూకంపం సునామీ ఫలితంగా ప్రజలు 150 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో చాలా మంది వలస వెళ్లారు. ఈ లింగ అసమతుల్యతకు బహుశా అది కారణమై ఉండవచ్చు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "POPULATION AND HOUSING CENSUS 2006 : ANALYTICAL REPORT". Sbs.gov.ws. Retrieved 2017-08-09.