సయ్యద్ ఇక్బాల్ హస్నైన్

సయ్యద్ ఇక్బాల్ హస్నైన్ భారతీయ (గ్లేసియాలజిస్టు) హిమనదీయ శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త. అతను సిక్కిం ప్రభుత్వ హిమనదీయ, వాతావరణ మార్పుల కమిషన్ ఛైర్మన్.[1] అతను కాలికట్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్. బ్లాక్ కార్బన్ అండ్ ట్రోపోస్పియర్ ఓజోన్ యొక్క గ్లోబల్ అసెస్మెంట్ పై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ కమిటీ సభ్యుడు.[2][3]

2002 నుండి 2006 మధ్య, హస్నైన్ భారతదేశంలోని కాలికట్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరుగా (ప్రెసిడెంట్) పనిచేశాడు. గతంలో, అతను జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (ఇండియా) హిమనదీయ శాస్త్ర ప్రొఫెసర్ పదవిని నిర్వహించాడు. అక్కడ అతను హిమనదీయ శాస్త్రాన్ని పోస్ట్-గ్రాడ్యుయేట్ పరిశోధన స్థాయిలో ఒక అంశంగా పరిచయం చేశాడు. 2010 వరకు అతను క్రియాశీలకంగా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Experts Speak". Climate Himalaya. 2016. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 27 February 2016.
  2. "Prof. (Dr.) Syed Iqbal Hasnain vs The University Of Calicut". India Kanoon. 2013. Retrieved 27 February 2016.
  3. "Asia's Growing Crisis of Floods and Droughts". Wilson Center. 19 October 2010. Retrieved 27 February 2016.

మరింత చదవండి

మార్చు