సరదాల సంసారం
సరదాల సంసారం 1997 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. ఉషశ్రీ ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఉష శ్రీ మారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. సురేష్, రుచిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దుగ్గిరాల సంగీతాన్నందించాడు.[1]
సరదాల సంసారం (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సాయిప్రకాష్ |
---|---|
తారాగణం | సురేష్, దేవి గ్రంథం |
నిర్మాణ సంస్థ | ఉషశ్రీ ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుమిత్ర చతుష్టయం అనే సూర్య (సురేశ్) అండ్ కో గూండాయిజం చేసి డబ్బు సంపాదించడమే వృత్తిగా పెట్టుకుని ఒక ఆఫీసును నిర్వహిస్తుంటారు. ఒకానొకరోజు ఓ రోమియో బారినపడ్డ జయ (రుచిత) సూర్యకు తారసపడ్తుంది. సూర్య ఆ రోమియోకి తన మిత్ర బృందంతో చితక బాదుతాడు. తరువాత సూర్య ప్రేమని అంగీకరించి తన లాయర్ అన్నయ్య (నరసింహరాజు) ఇష్టానికి వ్యతిరేకంగా అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది జయ. సూర్య తమ్ముడు చంద్రం ఎం.ఎ. ఫస్ట్ క్లాస్‌లో పాసవుతాడు. డబ్బు సంపాదించడానికి తన అన్న అనుసరించే మార్గాన్ని అసహ్యించుకుంటూ ఉంటాడు. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలని భావిస్తాడు. ఆ క్రమంలో సూర్య రికమెండ్ చేసిన ఉద్యోగాన్ని కూడా తిరస్కరిస్తాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్లినా 'నో వేకన్సీ' బోర్డు దర్శనమిస్తుంటుంది. లేదంటే లంచం ఇవ్వమనైనా అడుగుతుంటారు. ఆఖరికి విసిగిపోయిన చంద్రం వదిన జయ ఇచ్చిన నగలతో ఉద్యోగం సంపాదించాలని వాటిని తనకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపిన బ్రోకర్ (సుబ్బరాయశర్మ) చేతిలో పెడతాడు. అయినా ఆ ఉద్యోగం అతడికి రాదు. బ్రోకర్ చేతిలో తను మోసపోయానని అర్థమైన చంద్రం కుమిలిపోయి అన్నా వదినలకి తన ముఖం చూపలేక ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తమ్ముడి చావు, జయ మాటలతో పరివర్తన చెందిన సూర్య మారిపోతాడు. మెకానిక్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆఖరుకి కంపెనీ ఎండీ మృదుల అతణ్ణి పార్టనర్‌గా కూడా చేర్చుకుంటుంది. జయ మరదల్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారని తెలియడంతో సూర్య ఆ రౌడీల్ని చితకతన్ని వేశ్యాగృహంలో ఉన్న జయ మరదల్ని రక్షించి ఆ వేశ్యాగృహంలోనే తన మిత్రబృందంలోని రాజుతో ఆమె పెళ్లి చేస్తాడు. గతంలో సూర్య చేతిలో దెబ్బలు తిన్నవాళ్లంతా అతడి అంతు చూడాలని ఓ 'ఇంటర్నేషనల్' గూండా (ప్రసాద్‌బాబు)కి డబ్బు చెల్లిస్తారు. అయితే అతణ్ణి కూడా మిత్ర చతుష్టయం చిత్తుగా చావగొడ్తుంది. మరోపక్క జయ మృదులతో తన భర్త సరస సల్లాపాలు సాగిస్తున్నాడనే భ్రమలోపడి విషం తాగుతుంది. ఆఖరికి ఎట్లాగో బతికి సూర్యని అతడి పూర్వపు మార్గాన్నే అంటే గూండాగిరినే కొనసాగించమనడంతో సినిమా ముగుస్తుంది.[2]
తారాగణం
మార్చు- సురేష్
- రుచిత
- ఓం సాయి ప్రకాష్
- నరసింహరాజు,
- గోకిన రామారావు,
- ప్రసాద్‌బాబు,
- సుబ్బరాయశర్మ
సాంకేతిక వర్గం
మార్చు- స్టుడియో: ఉషః శ్రీ ఆర్ట్ పిలింస్
- కథ, స్క్రీణ్ ప్లే : ఉషః శ్రీ మారెడ్డి
- మాటలు: దురికి మోహనరావు
- పాటలు: ఉషః శ్రీ మారెడ్డి, జె.ఆర్.సుధీర్
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- నృత్యాలు: శివశంకర్
- దుస్తులు: ఎన్.జయ చంద్ర, అజయ్
- ఆర్ట్: పింజల వెంకటేశ్వరరావు
- స్టిల్స్: యర్రోజు ప్రసాద్
- ఫైట్స్: నాగిరెడ్డి
- ఆపరేటివ్ కెమేరామన్: ఎం.మహేష్
- ఎడిటింగ్: కె.నరసయ్య
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శంకర్ కంతేటి
- సంగీతం: దుగ్గిరాల
- నిర్మాత: ఉషః శ్రీ మారెడ్డి
- దర్శకత్వం: సాయిప్రకాష్
మూలాలు
మార్చు- ↑ "Saradala Samsaram (1997)". Indiancine.ma. Retrieved 2021-05-29.
- ↑ ఆంధ్రభూమి 'వెన్నెల', 1 ఆగస్ట్ 1997