సర్గమ్ కౌశల్
సర్గమ్ కౌశల్ (జననం 1990 సెప్టెంబరు 20) భారతీయ ఉపాధ్యాయురాలు, మోడల్. ఆమె మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ. దేశానికి 21 సంవత్సరాల తర్వాత ప్రఖ్యాత అందాల కిరీటం తిరిగి తెచ్చిపెట్టినందుకు ఆమె ప్రసిద్ధిచెందింది.[1]
మిసెస్ వరల్డ్ సర్గమ్ కౌశల్ | |
---|---|
జననం | |
విద్య | ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీ |
విద్యాసంస్థ | జమ్మూ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | ఆదిత్య మనోహర్ శర్మ |
తల్లిదండ్రులు |
|
బాల్యం
మార్చుసర్గమ్ కౌశల్ 1990 సెప్టెంబరు 20న భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌లో రీమా ఖజురియా, జి.ఎస్ కౌశల్ దంపతులకు జన్మించింది. ఆమెకు మంథన్ కౌశల్ అనే తమ్ముడు ఉన్నాడు.
కెరీర్, మిసెస్ వరల్డ్ గా ప్రస్థానం
మార్చుజమ్మూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ కళాశాల నుండి బి.ఇడి పూర్తిచేసిన సర్గమ్ కౌశల్ విశాఖపట్నంలో కొంతకాలం ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.[2] ప్రస్తుతం ఆమె ముంబైలో స్థిరపడి క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
సర్గమ్ కౌశల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2022 అందాల పోటీలో పాల్గొంది. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ 2022 జూన్ 15న ముంబైలో జరగగా దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది పోటీదారులు పాల్గొన్నారు. అనేక రౌండ్‌ల తర్వాత సర్గమ్ కౌశల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2022గా నిలిచింది.[3]
ఇక అంతర్జాతీయ అందాల పోటీ విషయానికి వస్తే వివాహిత మహిళల కోసం మిసెస్ వరల్డ్ అందాల పోటీలు 1984 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు ఉండగా ఆ తర్వాత దాన్ని 1988లో మిసెస్ వరల్డ్ గా మార్చారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. కాగా అమెరికాలోని లాస్‌వేగాస్‌లో 2022 డిసెంబరు 17 (భారతకాలమానం ప్రకారం)న జరిగిన మిసెస్ వరల్డ్ 2022 పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్ కౌశల్ కు 2021లో మిసెస్ వరల్డ్ విజేత అమెరికాకు చెందిన షాయలిన్ ఫోర్డ్ ఈ కిరీటాన్ని అందజేసింది. ఆమె గులాబీ రంగు గౌను, అందమైన క్రిస్టల్ చెవిపోగులు ధరించింది. ఆమె కాస్ట్యూమ్‌ని భావనా రావు డిజైన్ చేశారు. ఈ పోటీల్లో మొత్తం 64 దేశాల నుండి పాల్గొనగా మిసెస్ పాలినేషియా తొలి రన్నరప్‌గా, మిసెస్ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు.
వ్యక్తిగతం
మార్చుసర్గమ్ కౌశల్ ఇండియన్ నేవీ ఆఫీసర్ అయిన ఆదిత్య మనోహర్ శర్మని 2018లో వివాహం చేసుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Mrs World 2022: 'మిసెస్ వరల్డ్ 2022'గా సర్గం కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం | Indian lady Sargam Koushal wins Mrs World 2022 psnr". web.archive.org. 2022-12-19. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Vaid, Kritika (2022-12-19). "Meet Sargam Koushal, a Teacher by Profession Who's Now Mrs. World 2022, Know Her Education, Family, Other Deets". Zee Media (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
- ↑ "Mrs India World 2022, Mrs India World, Mrs India World 2022 News: Sargam Koushal Bags The Title Of Mrs India World 2022". web.archive.org. 2022-12-19. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)