సలీం గఫూర్ ఒక బస్సు డ్రైవర్. ఆయన ఉగ్రవాదులు విచక్షణారహితంగా బస్సుపై తూటాలు కురిపిస్తున్నా, ధైర్యసాహసాలతో 52 మంది ప్రాణాలు కాపాడినందుకు గానూ భారత రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం "సర్వోత్తం జీవన్ రక్షా పతక్" లభించింది.[1]

బస్సుపై కాల్పుల సంఘటన

మార్చు

2017, జూలై 10న మంచులింగ దర్శనం కోసం శివనామ స్మరణతో భక్తులు భారీగా తరలి వెళుతున్నారు. గుజరాతీ డ్రైవర్‌ షేక్‌ సలీం గఫూర్‌ నడుపుతున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఉగ్రవాదుల తూటాలకు ఏడుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు. బస్సును ఆపితే మొత్తం ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదమని గుర్తించిన గఫూర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బస్సును ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో 52 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.[2] అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన గఫూర్‌కు ‘ఉత్తమ జీవన రక్షా పతకం’ను ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. ఇది పౌరులకు అందించే రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కావడం గమనార్హం. పురస్కారంతో పాటు గఫూర్‌కు రూ.లక్ష అందజేసారు. [3]

మూలాలు

మార్చు
  1. "భక్తులను కాపాడిన బస్సు డ్రైవర్‌కు శౌర్య పతకం-". www.andhrajyothy.com. Archived from the original on 2018-01-28. Retrieved 2018-01-25.
  2. "Driver who saved Amarnath pilgrims gets second highest award". The Indian Express. 2018-01-24. Retrieved 2018-01-25.
  3. "ప్రాణదాతకు పతకం -". www.andhrajyothy.com. Archived from the original on 2018-01-25. Retrieved 2018-01-25.