సల్సా నృత్యం
సల్సా నృత్యం కరేబియన్ దీవుల్లో పుట్టిన ఒక సాంఘిక నృత్య రీతి. ఈ నృత్యం ఇదే పేరుతో ఉన్న సంగీత శైలితో సంబంధం కలిగి ఉంది. ఇది 1960 లలో న్యూయార్క్ నగరంలో పుట్టింది.[1] [2] [3] ఇది 1950 ల చివరినాటికి హవానాలోని నృత్యశాలలు, నైట్‌క్లబ్‌లలో ప్రసిద్ది చెందిన వివిధ క్యూబన్ నృత్యాలు (ఉదా. కాసినో, మాంబో, పంచంగా ), ఇంకా అమెరికన్ జాజ్ నృత్యాల సమ్మేళనం. దీనిని ప్రధానంగా 1960 ల చివరలో, 1970 ల ప్రారంభంలో న్యూయార్క్ లో నివసిస్తున్న ప్యూర్టోరికన్లు అభివృద్ధి చేశారు.[4] లాటిన్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు క్యూబన్, ప్యూర్టో రికన్, కాలి కొలంబియా, LA, న్యూయార్క్ వంటి ప్రత్యేకమైన సల్సా శైలులను కలిగి ఉన్నాయి. సాంఘిక సల్సా డ్యాన్స్ కార్యక్రమాలు ముఖ్యంగా బహిరంగ పండుగలో భాగంగా ఏర్పాటు చేసేవి సాధారణంగా నైట్‌క్లబ్‌లు, బార్‌లు, నృత్యశాలలు, రెస్టారెంట్లు, వెలుపల జరుగుతాయి.
సల్సా డ్యాన్స్ యొక్క అనేక శైలులలో, ఒక నర్తకి తన బరువును అటూ ఇటూ మార్చడం కోసం మధ్యలోకి అడుగు పెడుతూ ఉంటుందు, కానీ ఎగువ శరీరం మాత్రం ఈ బరువు మార్పుల వల్ల దాదాపుగా ప్రభావితం కాదు. కదలిక ఎనిమిది అంకెరూపంలో ఉంటుంది, ఇది తుంటి ఎముక కదలడానికి కారణమవుతుంది. చేయి, భుజం కదలికలు కూడా చేర్చబడ్డాయి. సల్సా టెంపో సుమారు 150 బిపిఎమ్ (నిమిషానికి బీట్స్) నుండి 250 బిపిఎం వరకు ఉంటుంది, అయినప్పటికీ చాలాసార్లు డ్యాన్స్ 160-220 బిపిఎమ్ మధ్య లో జరుగుతుంది. ప్రాథమిక సల్సా నృత్య లయలో ప్రతి నాలుగు బీట్స్ సంగీతానికి మూడు అడుగులు వేయడం ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ Boggs 1992, pp. 187-193
- ↑ Hutchinson 2004, p. 116. Hutchinson says salsa music and dance "both originated with Cuban rhythms that were brought to New York and adopted, adapted, reformulated, and made new by the Puerto Ricans living there."
- ↑ Catapano 2011
- ↑ Simon Broughton; Mark Ellingham; Richard Trillo (1999). World Music: Latin and North America, Caribbean, India, Asia and Pacific. Rough Guides. p. 488. Retrieved 2013-12-04.