సవరము చిననారాయణనాయకుడు

సవరము చిననారాయణ నాయకుడు
జాతీయతభారతదేశం
వృత్తికవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కువలయాశ్వ చరిత్ర

సవరము చిననారాయణనాయకుడు మార్చు

ఈకవి కువలయాశ్వచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి, తిమ్మనరపాలపుత్రుడయిన నారాయణభూపాలుని కంకితము చేసెను. ఈకవి తాను క్షత్రియుడ ననియు, రాయభూపాలుని పుత్రుడననియు చెప్పికొనియున్నాడు. ఈతడు రాయభూపాలునకు దిరుమలాంబ వలన గలిగిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.-

 మ. అత డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుచ్ఛేదనో
    ద్ధతు రంగాధిపు దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు ను
    న్నతకీర్తిం బిననారనాఖ్య దగు నన్నున్ గస్తురీంద్రున్ సమం
    చితకీర్తిన్ రఘునాథ దిమ్మవిభు గాంచెన్ నజ్జనాధారులన్

కవి కాలాము మార్చు

కృతిపతి యైన నారాయణభూపాలుడు శ్రీరంగరాజ వేంకటపతిరాయలకు సహాయు డయియుండినట్లు చెప్పబడినందున గవి 1580 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు కానవచ్చుచున్నాడు. మఱియు గృతినాయకుడైన నారనరనాధుడు మట్ల యనంతభూపాలునికాలములో నుండిన ట్లీక్రింది పద్యమునందు జెప్పబడినందునను, కవి పదునాఱవశతాబ్దాంతమునం దుండినట్లు నిర్ధారణము చేయవచ్చును-

 సీ. తనమాట చెంజికా తంజాపురీ మధురాధినాథులకు నెయ్యంబు నెఱప
   దనసిరి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల వహింప
   దనకీర్తిమట్లనంతనృపాలముఖ్యగోత్రామరేంద్రులు కొనియాడికొనగ
   దనదానగుణముగోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనగ

వెలయు వేదండగండనిర్గళదవర్గ
   ళమదధారాధునీనాధకుముదబంధు
   కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యు
   డతడు ప్రభుమాత్రు డే నారనాధి నేత.

ఇతని కవిత్వము గురించి కొన్ని పద్యములు మార్చు

[ 215 ] ఈకవి కాశ్యపగోత్రుడు; శఠగోపతాపసేంద్ర శిష్యుడు. ఈతని కవిత్వము సలక్షణమయి వినసొంపుగా నుండును. ఈతని కువలయాశ్వచరిత్రములోని కొన్నిపద్యముల నిందుదాహరించుచున్నాను.

 చ. మిటిమిటి యెండవేడి బలిమిం దెలిదమ్ముల ఱేకుసందులం
   జిటుకుమనంగ గూడి నివసించి తదగ్రమరంద మప్పట
   ప్పటికిని మూతిముట్టి పయిపై నది చల్లబడంగ బ్రొద్దుగ్రుం
   కుట గని యంతటం బొదలు గోడెమిటారపు దేటు లత్తఱిన్. [ఆ.1]
చ. మునివనితల్ శచీముఖతమోనిభవేణులకుం బతివ్రతా
   జనతతి దెల్పుచో బరవిచారముగా గను వేల్పుటొజ్జజ
   వ్వని మొగ మవ్వలం జొనుప వారలు నవ్వుదు రామె సిగ్గుపెం
   పున దలవంచు జందురుడు పొంగగ నయ్యయియాగ వేళలన్. [ఆ.2]

చ. తలపున నెంత మోహపరితాపముగల్గిన దాచుకొందురో
   యలయిక లేక నీకరణి నంగడిబెట్టుదురో వధూటికల్
   పలుకవు నిన్నునంటికులభామల గానమె వారి కాత్మనా
   థులపయి బాళిలేదొ తమిదొట్టినపట్టున మట్టు పెట్టరో. [ఆ.3]

మ.అత డచ్చో దురగంబు నెక్కి హృదయాబ్జాపూర్ణ మోదార్ణ వాం
   చితుడై నారల వెన్క నుంచుకొని యక్షీణైక్యమాణిక్యదీ
   ధితిజాతామృతరుగ్వితాన మగుదై తేయాధినాధాయతా
   యతనం బల్లవ నిర్గమించి పురబాహ్యక్షోణి కేతెంచుచున్. [ఆ.4]

చ. వెలుపలిరచ్చ నొక్కయెడ వేలుపుసానికి వన్నెకానికిన్
   గలహము కల్గెనేని గుఱికానితనంబున వచ్చి రోసపుం
   బలుకుల వాదు రేచి సిగపట్లకు డగ్గఱజేసి క్రొవ్వునం
   గలకల నవ్వువాడు చవుకట్లసియాడ రుమాలువీడగన్. [ఆ.5]

మూలాల జాబితా మార్చు

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు. సవరము చిననారాయణనాయకుడూ' (విభాగం)