సహజీవనం
సహజీవనం అనునది పెళ్ళి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం. ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో కనిపిస్తుంది. ఈమధ్య (2015 నాటికి) భారతదేశంలో కూడా యువతీ యువకులు సహజీవనం చేస్తున్నారు.
నేపధ్యము
మార్చుసహజీవనానికి హద్దులు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇరువురి అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు సహజీవనం చేసేవారు కొంతకాలం తర్వాత వివాహ బంధంతో కూడా ఒక్కటవుతారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో సహజీవనం చేస్తున్న జంటలు, పిల్లలను కూడా కలిగి ఉంటారు. ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కలిసి ముందుకు సాగడమో లేదా ఆ బంధానికి అక్కడితో ముగింపు పలకడమో చేస్తారు.
చరిత్ర
మార్చుసహజీవనం భారతీయ సమాజానికి కొత్త అయినా ఈ వ్యవస్థ కొన్ని శతాబ్దాల క్రితమే ఆచరణలో ఉండేదని తెలుస్తున్నది. మానవ శాస్త్రము, సామాజిక శాస్త్రంల దృక్కోణములో చూసినపుడు ఈ సహజీవనము మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందుతున్న పెళ్ళి, కుటుంబ వ్యవస్థ లతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ముడిపడి ఉన్నట్లు తెలుస్తున్నది. మానవుడు ఆదిమమానవుని నుండి నాగరిక మానవునిగా, అటుపైన ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందినప్పటికీ స్త్రీ పురుషుల సంబంధాల మధ్య గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బహుశా ఇందులో సంతానం కోసం స్త్రీ పురుషులు సంభోగ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనవలసి రావడం ప్రధాన కారణంగా చెప్పవలసి రావచ్చు[1].
మానవజాతి సంభోగ ప్రక్రియలో ఇతర జీవజాతులతో తరచుగా పోల్చబడుతారు. ప్రముఖ న్యూరో బయాలజిస్టు రాబర్ట్ సపోల్‌స్కీ ఈ విషయంలో ఒక వివరమైన పటమును తయారు చేశాడు. ఇందులో స్త్రీ పురుషుల ప్రవృత్తి ధ్రువాలుగా చూపబడింది. ఇందులో గమనించదగిన విషయం ఏమంటే పురుషుడు సంతానం కోసం స్త్రీతో జత కట్టడానికి ఆసక్తి చూపుతాడు. క్రమేణా ఆ బంధం బలపడి ఇరువురూ వివాహ బంధంలో అడుగు పెడతారు.[2]
మూలాలు
మార్చు- ↑ Note: although even this is changing, with the advent of test-tube babies, in vitro fertilization, and such.
- ↑ Robert Sapolsky (2005). "Biology and Human Behavior: The Neurological Origins of Individuality, 2nd edition". The Teaching Company. Retrieved 2010-12-07.
(lectures on CD-audio)
బయటి లంకెలు
మార్చు- నూర్ బాషా రహంతుల్లా (2019-08-21). "మితిమీరుతున్న సహజీవనం". సూర్య. Archived from the original on 2019-08-22.