సహాయం:మెరుగైన ఇటీవలి మార్పులు

ఇటీవలి మార్పులు పేజీని మెరుగుపరచి, మెరుగైన ఇటీవలి మార్పులను చూపించే విధంగా అభిరుచులు పేజీలో నిర్దేశించుకోవచ్చు.. అది ఇటీవలి మార్పులను వ్యాసాల వారీగా, రోజువారీగా గుంపుగా చేస్తుంది. ప్రతి రోజుకు, ఆ రోజు జరిగిన మార్పు చేర్పులను వ్యాసాల వారీగా గుది గుచ్చి, కొత్త మార్పు నుండి పాత మర్పు వరకు వారుసగా పేర్చి, వ్యాసం పేరుతో చూపిస్తుంది. అన్నిటి కంటే కొత్త మార్పును చూపించి మిగతా వాటిని దాస్తుంది. అయితే వ్యాసం పేరు పక్కన ఉన్న నీలం బాణం గుర్తును నొక్కినపుడు అన్ని మార్పుచేర్పులు కనిపిస్తాయి. ఇది జావాస్క్రిప్టుతో పనిచేస్తుంది. అంచేత అన్ని బ్రౌజర్లలోను పనిచెయ్యదు.

ఈ విశేషం సంబంధిత మార్పులు, మెరుగైన వీక్షణ జాబితా లకు కూడా వర్తిస్తుంది.

ఒక్కో వరుసలో ఏమేముంటాయి మార్చు

ఒకే మార్పు ఉన్న పేజీలు మార్చు

వరుసలో ఇవి ఉంటాయి:

  • సమయం (తేదీ కనిపించదు, అది శీర్షంలో ఉంటుంది)
  • పేజీ యొక్క ప్రస్తుత కూర్పుకు లింకుతో పేజీ పేరు
  • ప్రస్తుత దిద్దుబాటుకు లింకుతో ప్రస్తు
  • పేజీ చరితం కు లింకుతోచరితం
  • తన సభ్యుని పేజీకి లింకుతో సభ్యుడు/సభ్యురాలు
  • సభ్యుని చర్చాపేజీకి లింకుతో చర్చ
  • దిద్దుబాటు సారాంశం

బహు మార్పులు ఉన్న పేజీలు మార్చు

బాణం గుర్తును నొక్కక ముందు కనిపించే ఒకే వరుసలో ఇవి ఉంటాయి:

  • సమయం
  • ప్రస్తుత కూర్పుకు లింకుతో పేజీ పేరు
  • ఆ రోజున జరిగిన దిద్దుబాట్ల సంఖ్య
  • జరిగిన మొత్తం మార్పుచేర్పులకు లింకుతో మార్పులు
  • పేజీ చరితం లింకు
  • తమ తమ సభ్యుని పేజీకి లింకులతో సభ్యుల పేర్లు

బాణం గుర్తు నొక్కిన తరువాత కనిపించే దిద్దుబాటు వరుసల్లో ఒక్కోదానిలో ఇవి ఉంటాయి:

  • సమయం, సదరు దిద్దుబాటు జరిగిన సమయానికి ఉన్న పేజీ కూర్పుకు లింకుతో
  • సదరు దిద్దుబాటుకు లింకుతో ప్రస్తు
  • సదరు దిద్దుబాటు యొక్క గత లింకు
  • సదరు దిద్దుబాటు చేసిన సభ్యుని పేరు, తన సభ్యుని పేజీకి లింకుతో
  • సభ్యుని చర్చా పేజీకి లింకుతో చర్చ
  • దిద్దుబాటు సారాంశం