సహాయం:మూస
మూస అంటే ఏదైనా పేజీలో ఇముడ్చగల మరో పేజీ. కంప్యూటరు ఆదేశావళి (ప్రోగ్రాము కోడు) లో పెట్టే #include అనే ఆదేశం వంటిదే ఇది.
ఈ పేజీ, మీడియావికీలోని మూసలకు సంబంధించిన వనరు. మూస గురించి సంక్షిప్త పరిచయం కోసం సహాయము:మూస గురించి క్లుప్తంగా పేజీ చూడండి.
గమనిక: ఈ పేజీకి సంబంధించిన అసలు కూర్పు మెటా-వికీపీడియా లోని m:Help:Template పేజీలో ఉంది. మూసల పరీక్షా ప్రదర్శనలు ఆ పేజీలో పనిచేస్తాయి, ఇక్కడ పనిచెయ్యకపోవచ్చు.
ప్రాథమికం
మార్చుమూస నేంస్పేసు అంటే "మూస:" అనే ఆదిపదం కలిగి ఉండే నేంస్పేసు
ఈ నేంస్పేసులో ఉండే పేజీని మూస అంటారు. అలాంటి పేజీలోని కంటెంటును ఇతర పేజీల్లో ఇమిడ్చేందుకు వీలుగా తయారు చేస్తారు.
"మూస:పేరు" అనే మూసను ఇతర పేజీల్లో ఇముడ్చేందుకు ఇలా రాయాలి: {{పేరు}}. దీన్ని మూస ట్యాగు అంటారు.
ఉదాహరణ: అ,ఆ {{మూనా}} అచ్చులు ({{మూనా}} మూసను ఉదాహరణగా తీసుకుని మూసను ఎలా వాడాలో చెప్పడం)
అది ఇలా కనిపిస్తుంది: అ,ఆ లు అచ్చులు.
వికీటెక్స్టులో ఇలా రాస్తే మూసలో ఉన్న కంటెంటు గమ్యం పేజీలో కనిపిస్తుంది. మూసను ఇలా రాయడాన్ని కింది విధాలుగా కూడా అనొచ్చు:
- మూసను పిలవడం (calling the template)
- మూసను చేర్చడం (including the template)
- మూసను ట్రాన్స్ క్లూడు చెయ్యడం (transcluding the template)
- మూసను వాడడం (using the template)
- మూసను ఇముడ్చడం (embedding the template)
మూసకు లింకు ఇచ్చేందుకు మామూలుగా వికీలింకు ఎలా ఇస్తామో అలా రాయడమే: [[మూస:పేరు]].
"మూస:పేరు" అనే పేజీ లేకపోతే, {{పేరు}}, [[మూస:పేరు]] లాగా పని చేస్తుంది. దాన్ని నొక్కినపుడు అ పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. మూస తయారు చేసే ఒక పద్ధతి.. ముందు ట్యాగు పెట్టడం, తరువాత ఆ లింకును అనుసరించడం.
పేరు ఏదైనా నేంస్పేసుతోగానీ, లేక కోలనుతో గానీ మొదలైతే దానికి ముందు "మూస:" రాదు. ఆ విధంగా ఏ పేజీనైనా మూసలా వాడుకోవచ్చు. (ముందు కోలను ఉంటే, దానర్థం అది మొదటి నేంస్పేసులోదన్నమాట.)
మూసను పిలిచేందుకు ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అన్నమాట. ఏదైనా చరరాశి పేరుతో ఘర్షణ వచ్చినపుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
మూస నేంస్పేసులోలేని పేజీలను మూసగా వాడడంలో కింది ఉపయోగాలున్నాయి.
- మీడియావికీ నేంస్పేసులోని సిస్టము సందేశాలు
- సభ్యులు మూసలపై చేసే ప్రయోగాల కోసం
- ఓ పేజీలోకి అదే నేంస్పేసులోని ఇతర పేజీలను చేర్చేందుకు. ఉదాహరణకు {{{{NAMESPACE}}:{{PAGENAME}}/చెయ్యాల్సినవి}}.
ఓ మూస మరో మూసను పిలవవచ్చు. ఓ మూస తననే మళ్ళీ పిలిస్తే, ఆ పిలుపు ఒక స్థాయికే పనిచేస్తుంది. అయితే, మూసలు మళ్ళీ మళ్ళీ పిలవదలచిన మూసకే దారిమార్పు చేస్తే, మూస కంటెంటును మళ్ళీ మళ్ళీ రాయకుండా రికర్షను సాధించవచ్చు.
మూసలో ఉండే చరరాశి మూస గమ్యం పేజీలోకి చేరాకే విలువ కట్టబడుతుంది. అంటే {{PAGENAME}} అనే చరం మూసలో ఉందనుకోండి. దాని విలువ ఆ మూస పేరే. ఆ మూసను ఏదైనా పేజీలోకి పిలిచినపుడు, పిలిచే పేజీ పేరే వస్తుంది, మూస పేరు కాదు.
పేజీలో వాడిన మూసల జాబితా దిద్దుబాటు పేజీలో దిగువన కనిపిస్తుంది. దీని గురించి కొన్ని విశేషాలు:
- విభాగం దిద్దుబాటు పేజీలో ముందు పూర్తి జాబితా కనిపిస్తుంది. అంటే ఇతర విభాగాల్లో వాడిన మూసలు కూడా నన్నమాట. సరిచూడు నొక్కినపుడు, విభాగంలో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి.
- అలాగే పేజీ యొక్క పాత కూర్పును దిద్దుబాటు చేసేటపుడు, ముందు ప్రస్తుత కూర్పుకు సంబంధించిన జాబితా కనబడుతుంది. సరి చూడు నొక్కినపుడు, అప్పటి కూర్పుకు సంబంధించిన మూసల జాబితా కనిపిస్తుంది.
- మూసను #if, #ifeq, #ifexist, #ifexpr, #switch వంటి షరతుల ఆధారంగా ఇమిడ్చినపుడు, షరతులకు తగ్గ స్థితి లేనప్పటికీ వాటిని ఇమిడ్చినట్టుగానే భావించి, మూసలను జాబితాలో చూపిస్తుంది.
- మూస పేరులో ఏదైనా ఎక్స్ ప్రెషను (ఏదైనా చరరాశి వంటిది) వాడవచ్చు. ఉదాహరణలు:
- {{ఇవ్వాళ్టి తేదీ: {{CURRENTDAY}}}}, - మూస:ఇవ్వాళ్టి తేదీ: 11 అని కనిపిస్తుంది.
- {{{{#ifexist:Template:అ|అ|x1}}|మూస లేదు}}, -
If you defined parameters such as {{Template sandbox|First|Second|name="Named"}}:
- First
- మూస లేదు
- Second
- {{{2}}}
- Name
- {{{name}}}
అని కనిపిస్తుంది. పై సందర్భాల్లో ప్రస్తుతమున్న మూస పేరు కనిపిస్తుంది.
Noinclude, includeonly
మార్చు<noinclude>, </noinclude> ల మధ్య ఉన్నదేదైనా ఆ పేజీని నేరుగా చూసినపుడు మాత్రమే కనిపిస్తుంది. ఏ పేజీలో నైతే ఆ మూసను పిలిచామో ఆ పేజీలో కనబడదు. వినియోగాలు:
- మూసలను వర్గీకరించేందుకు.
- ఇతర భాషల్లోని అదే మూసకు లింకు ఇచ్చేందుకు
- మీడియావికీ నేముస్పేసు లోని పేజీలకు
దీనికి వ్యతిరేకమైనది <includeonly>. <includeonly>, </includeonly> ల మధ్యనున్న పాఠ్యం మూసను నేరుగా చూసినపుడు కనబడదు. ఆ మూసను పిలిచిన పేజీలో మాత్రమే కనిపిస్తుంది. వినియోగాలు:
- ఆ మూసను వాడే అన్ని పేజీలను, ఆ మూసను కాకుండా, ఒక వర్గం లోకి చేర్చేందుకు.
- మూస పేజీ గందరగోళంగా లేకుండా చెయ్యడం
మామూలు విషయానికీ ఈ ట్యాగుల్లోని విషయానికీ మధ్య ఉండే ఖాళీలు, కొత్త లైన్లూ మామూలు విషయానికే చెందుతాయి. అలా వద్దనుకుంటే ట్యాగు అదే లైనులో వెంటనే మొదలు పెట్టాలి:
<noinclude>ఇది </noinclude>బాగానే ఉంది<includeonly>, మూత ట్యాగులు </includeonly><noinclude> అంత క్రిటికలేమీ కావు, కానీ తప్పక రాయాలి.</noinclude>
ఈ ట్యాగులను నెస్టు చేసినపుడు - <nowiki>, </nowiki> జత, అనుకున్నట్టుగా పనిచెయ్యవు. ఉదాహరణకు <nowiki> అనేది ఎక్కడ మొదలైతే - అంటే సామాన్య విభాగంలో గానీ, noincude లోగానీ, includeonly లోగానీ - మూత కూడా ఆ విభాగంలోనే వెయ్యాలి.
~<includeonly>~</includeonly>~~
అనే కోడు మూసను ఏ పేజీలోనూ చేర్చనపుడు ~~~ ఇలా కనిపిస్తుంది. వేరే పేజీలో చేర్చినపుడు ~~~~ ల కనిపిస్తుంది. దాన్ని ప్రతిక్షేపించినపుడు సభ్యుని సంతకంలా కనిపిస్తుంది.
మూస మొదట్లో వికీమార్కప్
మార్చుమూస లోని మొదటి కారెక్టరు :;*# ల వంటి వికీ మార్కప్ కారెక్టరైతే, ఆ మూసను పిలిచే పేజిలో (పిలుస్తున్నది లైను మధ్యలో ఐనప్పటికీ) ఆ కారెక్టరు లైను మొదటి స్థానంగానే భావిస్తుంది.
దీన్ని నివారించేందుకు <nowiki>#</nowiki> వాడండి. లేదా : లాగా న్యూమరిక్ కారెక్టరు రిఫరెన్సును వాడండి.
ప్రతిక్షేపణ
మార్చుమొదటి జత బ్రాకెట్ల తరువాత "subst:" రాసి పేజీని భద్రపరచినపుడు ఆ మూస లోని పాఠ్యం పిలిచే పేజీలోకి చేరి రెండరై పోతుంది. ఇక ఆ మూసలో చేసిన మార్పులు పిలిచే పేజీలో కనిపించవు.మూస:క్రైస్తవ మతము
See also
మార్చు- Help:Advanced templates
- సహాయము:Calculation
- సహాయము:Parser function
- ParserFunctions
- Help:Parameter default
- సహాయము:Magic words
- సహాయము:Substitution
- సహాయము:Template documentation
- సహాయము:Variable
- సహాయము:What links here
- interwiki transclusion
- MediaWiki help templates
- List of all templates on this server
- మూస:H:mlm
- మూస:H:mlww
- mw:Extension:ExpandTemplates
- mw:Extension:Labeled Section Transclusion - transclusion of part of a page