సాంబ్రాణి
సాంబ్రాణి (ఆంగ్లం:బెంజోయిన్) [1] అనేది స్టైరాక్స్ జాతికి చెందిన చెట్ల బెరడు నుండి తయారుచేయబడిన ఒక రకమైన రెసిన్. సాంబ్రాణి ఒక విధమైన పొడి లాగా వచ్చే సుగంధ ద్రవ్యము. దీనిని అగ్నిలో వేస్తే తెల్లని పొగ వచ్చి సుగంధాలు అంతా వ్యాపిస్తాయి. ఇది దేవతార్చనలో ధూపంగా ఉపయోగిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యంగా, ధూపంగా, మందులలో ఉపయోగిస్తారు. ఇది రసాయాన పదార్థమైన "బెంజోయిన్" కాదు.
బెంజోయిన్‌ను కొన్ని సార్లు "గం బెంజోయిన్" లేదా గమ్ బెంజమిన్[2] అని పిలుస్తారు. భారతదేశంలో "సాంబ్రాణి" లేదా "లోబన్" అని పిలుస్తారు. "లోబన్" అనేది అరబిక్ పదమైన "లూబన్" నుండి వచ్చింది. అనగా గుగ్గిలం-రకమైన సుగంథ ద్రవ్యము.[3][4] బెంజోయిన్ ను "స్టోరాక్స్" అని కూడా పిలుస్తారు.
ధూపం తయారీ, సుగంధ ద్రవ్యాలలో బెంజోయిన్ ఒక సాధారణ పదార్ధం. ఎందుకంటే దాని తియ్యని వెనీలా లాంటి వాసన, ఫిక్సేటివ్ లక్షణాలు కలిగి ఉండటం. రష్యా, కొన్ని ఇతర సనాతన సాంప్రదాయం గల క్రైస్తవ సమాజాలతో పాటు పాశ్చాత్య కాథలిక్ చర్చిలలో ఉపయోగించే చర్చి ధూపం ప్రధాన భాగం గమ్ బెంజోయిన్[5]. పెర్షియన్ గల్ఫ్, భారతదేశంలోని అరబ్ రాష్ట్రాలలో బెంజోయిన్ చాలా ఉపయోగించబడుతుంది. ఇక్కడ దీనిని బొగ్గుపై ధూపంగా కాలుస్తారు. జపనీస్ ధూపం, భారతీయ ధూపం, చైనీస్ ధూపం, పాపియర్ డి అర్మేనీ, ధూపం కర్రలలో కూడా బెంజోయిన్ ఉపయోగించబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ Wedgwood, Hensleigh (1855). "On False Etymologies". Transactions of the Philological Society (6): 67.
- ↑ C. F. Leyel (2007). Herbal Delights. Health Research Books. p. 242.
- ↑ A. Dietrich (1986), "LUBĀN", The Encyclopaedia of Islam, vol. 5 (2nd ed.), Brill, p. 786a
- ↑ Thomas Kinkele (30 Jun 2005). Incense and Incense Rituals. Lotus Press. p. 117.
- ↑ St. Alban Blend