సామాన్య ప్రవేశ పరీక్ష
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సామాన్య ప్రవేశ పరీక్ష (ఇంగ్లీషు - Common Admission Test/CAT) అనునది పరిమాణాత్మక సామర్థ్యం, దత్తాంశ అవగాహన, భాషా నైపుణ్యం, తార్కికతలను పరీక్షించడానికి నిర్వహింపబడే ఒక ఆన్‌లైన్ పరీక్ష. ఈ ప్రవేశపరీక్షని, భారతీయ నిర్వహణా సంస్థలు లేదా ఐ.ఐ.ఎం.లు తమ వ్యాపార పరిపాలనా విద్యాకార్యక్రమాల ప్రవేశంలో భాగంగా నిర్వహిస్తాయి. 2011 ఆగస్టులో ఐ.ఐ.టీలు, ఐ.ఐ.ఎస్సీలలోని కార్యక్రమాలకి కూడా సామాన్య ప్రవేశ పరీక్షని వాడబోతున్నారనే ప్రకటనలు వెలువడ్డాయి. అందువలన, ఆయా సంస్థల 2012-14 సంవత్సరపు విద్యాకార్యక్రమాలలో ప్రవేశం ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. సా.ప్ర.ప ఐఐఎం లలో ప్రవేశానికి ఉద్దేశింపబడినా, కొన్ని ఇతర సంస్థలు కూడా దీనిద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో 20 రోజుల పాటు నిర్వహింపబడుతుంది. అభ్యర్థి ఈ 20 రోజుల్లో ఏదో ఒకరోజు పరీక్ష రాయవలసి ఉంటుంది.
పరీక్షా కాలం, సరళి
మార్చుకంప్యూటర్ సహాయంతో నిర్వహింపబడే ఈ పరీక్షలో రెండు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో పరిమాణాత్మక సామర్థ్యం, దత్తాంశ అవగాహన రెండవ విభాగంలో భాషా నైపుణ్యం, తార్కికతలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ప్రతీ విభాగంలో 30 ప్రశ్నలుంటాయి, 1 గం. 10 ని. సమయం కేటాయించబడుతుంది. పరీక్ష మొదలుకావడానికి ముందు 15-నిమిషాల శిక్షణ ఉంటుంది. మొత్తంగా పరీక్షా సమయం 2 గం. 35 ని.లు.