సామాన్య శకం

ప్రస్తుతం వాడుకలో ఉన్న క్రీస్తు శకానికి ప్రత్యామ్నాయ నామం

"క్రీస్తు శకం" యొక్క నవీన రూపం సామాన్య శకం లేదా సామాన్య శకము. ఇంగ్లీషులో దీన్ని కామన్ ఎరా (Common Era) అని లేదా కరంట్ ఎరా (Current Era) అనీ అంటారు. అనూచానంగా వస్తున్న "యానో డొమిని" యొక్క ప్రత్యామ్నాయ నామమే ఈ "కామన్ ఎరా". మత తటస్థతే ప్రధాన లక్ష్యంగా ఈ మార్పు జరిగింది. లాటిన్ భాషలో యానో డొమిని (Anno Domini -AD) ని కామన్ ఎరా (Common Era -CE) గాను, బిఫోర్ క్రైస్ట్ (Before Christ -BC) ను బిఫోర్ కామన్ ఎరా (Before Common Era -BCE) గాను వ్యవహరిస్తున్నారు. వీటిని తెలుగులోకి కింది విధంగా అనువదించడమైనది.

  • "క్రీస్తు శకం" -- "సామాన్య శకం" (సా.శ)
  • "క్రీస్తు పూర్వం" -- "సామాన్య శక పూర్వం" (సా.శ.పూ)

ఈ మార్పు పేరులోనే తప్ప కాలగణనలో కాదు. కాలగణనలో క్రీస్తు శకానికీ సామాన్య శకానికీ ఏమీ తేడా లేదు. క్రీ.పూ 512, సా.శ.పూ 512 గాను, క్రీ.శ 1757, సా.శ 1757 గాను మారుతాయి.