సాయుధ దళాల వైద్య కళాశాల

సాయుధ దళాల వైద్య కళాశాల (Armed Forces Medical College - AFMC) మహారాష్ట్ర లోని పూణేలో ఉన్న వైద్య కళాశాల. ఈ కళాశాల భారత సాయుధ దళాల నిర్వహణలో ఉంది. ఇది బిసి రాయ్ కమిటీ సిఫార్సుపై రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948 మేలో స్థాపించబడింది. ఈ ఎఎఫ్‌ఎమ్‌సి అండర్‌గ్రాడ్యుయేట్ వింగ్ 1962 ఆగస్టు 4 న స్థాపించబడింది, ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని పూర్వ విద్యార్థులు ఎఎఫ్‌ఎమ్‌సి దినోత్సవంగా జరుపుకుంటారు. ఎఎఫ్‌ఎమ్‌సి భారతదేశపు గొప్ప వైద్య కళాశాలల్లో ఒకటిగా ఉంది. ఇది అవుటులుక్ 2012, 2015 లలో చేసిన సర్వేలో దేశంలోని అన్ని అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య సంస్థల లోకీ రెండవ స్థానం సంపాదించింది. ఈ సంస్థ శిక్షితులైన డాక్టర్లను అందించడం ద్వారా మొత్తం త్రివిధ దళాలను పరిపుష్టం చేసింది. ఇది ప్రధానంగా వైద్య అండర్‌గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లు, దంత పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లు, నర్సింగ్ సభ్యులు, పారామెడికల్ సిబ్బందికీ శిక్షణనిస్తుంది.

ఆర్మెడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్
AFMC
ఎఎఫ్‌ఎమ్‌సి ప్రధాన భవనం
నినాదంसर्वे सन्तु निरामयाः
స్థాపితంమే 1, 1948
డీన్మేజర్ జనరల్ ఎకె దాస్
స్థానంపూణే, మహారాష్ట్ర, భారతదేశం
కాంపస్పట్టణ

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు