సావిత్రీ చరిత్రము (హరికథ)
సావిత్రీ చరిత్రము 1923 అక్టోబరు 22న హరికథా పితామహునిగా పేరుగాంచిన ఆదిభట్ట నారాయణ దాసు రచించిన హరికథ. ఈ పుస్తకానికి ప్రకాశకులు కందుల గోవిందం. ఈ పుస్తకాన్ని బెజవాడ లోని వాణీ ముద్రాక్షరశాలయందు ముద్రించారు.
కవి పరిచయం
మార్చుఆదిభట్ల నారాయణ దాసు హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే భిరుదు పొందాడు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఇది ఆయన రచించిన అతి తక్కువ హరికథల్లో ఒకటి.