సావిర కంబద బసది
సావిర కంబద దేవాలయం (సావిర కంబద బసది) లేదా త్రిభువన తిలక చూడామణి,భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన మూడబిద్రి లో గల 1000 స్థంబాల జైన దేవాలయం. ఈ దేవాలయాన్ని జైన తీర్థంకరుడు చంద్రప్రభ గౌరవార్థం "చంద్రనాథ దేవాలయం" అని కూడా పిలుస్తారు. అతని ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పుణ్యక్షేత్రంలో పూజిస్తారు[1]. మూడబిద్రి పట్టణం 18 జైన దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. అయితే సావిర కంబద ఆలయం వాటిలో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది.[2][3].
సావిర కంబద బసది | |
---|---|
త్రిభువన తిలక చూడామణి | |
మతం | |
అనుబంధం | జైన మతం |
దైవం | చంద్రప్రభ |
పండుగలు | మహావీర్ జయంతి |
పరిపాలన సంస్థ | శ్రీ మూడబిద్రి జైన మత |
భట్టారక | చారుకీర్తి పండితాచార్య వర్య |
ప్రదేశం | |
ప్రదేశం | మూడబిద్రి,కర్ణాటక |
భౌగోళిక అంశాలు | 13°04′27.3″N 74°59′51.5″E / 13.074250°N 74.997639°E |
వాస్తుశాస్త్రం. | |
సృష్టికర్త | దేవరాయ వొడయార్ |
స్థాపించబడిన తేదీ | 1430 AD |
దేవాలయాలు | 18 |
చరిత్ర
మార్చుసావిర అనగా కన్నడ భాషలో వేయి అని అర్థం. కంబద అంటే స్తంభము అని అర్థం.ఇది వేయి స్తంభములు గల జైన మందిరము. మంగళూరు పట్టణమునకు 34 కిలోమీటర్ల దూరంలో మూడుబిద్రి గ్రామశివారుల్లో ఈ జైన మందిరం వున్నది. భారతదేశంలోని అతిపెద్ద, ప్రముఖ జైనమందిరాలలో ఇది ఒకటి. కర్ణాటకలోని జైన మందిరాలను బసదిగా వ్యవహరిస్తారు. త్రిభువన తిలక చూడామణి బసది అని మరొక పేరు కూడా వుంది. ఇరవై నాల్గు మంది జైన తీర్థంకరులలో ఎనిమిదివ తీర్థంకరుడైన చంద్రప్రభుని బసది ఇది. మందిరంలోని ఏ రెండు స్తంభములలోని శిల్పచాతుర్యం ఒకదానినొకటి పోలిక ఉండకపోవడం విశేషం. క్రీస్తు శకం 1430వ సంవత్సరంలో దేవరాయ ఒడియార్ అనే రాజు నిర్మించాడు. ప్రాచీన కన్నడలిపిలోని అనేక శిలాశాసనాలు ఈ బసదిలో వున్నాయి.[4]
చిత్రమాలిక
మార్చు-
8వ తీర్థంకరుడు, చంద్రప్రభ విగ్రహం
-
జైన విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం విశ్వాన్ని వర్ణించే చిత్రలేఖనం
-
జంబుద్వీపను చిత్రీకరించే పెయింటింగ్
-
బసది లోపల స్తంబాలు
-
కల్లు బసది
-
కోటి బసది
-
గురు బసది
-
లెప్పద బసది
-
విక్రంశెట్టి బసది
-
దెరెమ్మ శెట్టి బసది