సిక్కిం క్రాంతికారి మోర్చా

సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్.కె.ఎం) ఇది భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. సిక్కిం అసెంబ్లీ సభ్యుడు పి.ఎస్.గోలే గా సుపరిచితుడైన ప్రేమ్ సింగ్ తమాంగ్ 2009 నుండి సిక్కిం ముఖ్యమంత్రి అయిన పవన్ కుమార్ చామ్లింగ్ పై విమర్శలు కురిపిస్తూ అతని నాయకత్వంపై విసుగు చెంది, 2013 ఫిబ్రవరిలో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీకి పోటీగా సిక్కిం క్రాంతికారి మోర్ఛాని స్థాపించాడు. 2019 మే 28న అప్పటివరకు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చామ్లింగ్ని ఓడించి గోలే ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టాడు.[1][2]

Prem Singh Tamang.jpg
ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా స్థాపకుడు

చరిత్ర

మార్చు

2014 ఎన్నికలు

మార్చు

2013 ఫిబ్రవరి 4న సిక్కిం పశ్చిమ నగరమైన సోరాంగ్‌లో మోర్చా పార్టీ ఏర్పడింది. పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా భారతి శర్మ ఎన్నికయ్యారు. ఆమె సిక్కిం రాజకీయ పార్టీకి మొదటి మహిళా నాయకురాలు.

2013 సెప్టెంబరు లో గోలే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 ఏప్రిల్ 12న జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 10 స్థానాలను గెలుచుకుని సిక్కిం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

2019 ఎన్నికలు

మార్చు

2019 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ బిజెపితో మంచి సంబంధాలను కలిగి ఉంది. కానీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ రాష్ట్రంలోని 32 నియోజకవర్గాల్లో పోటీ చేసి 17 స్థానాలను గెలుచుకుంది. దాంతో సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ 25 సంవత్సరాల పాలన ముగిసింది.[3] సిక్కిం లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఇందిరా హాంగ్ సుబ్బా సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్థి డీక్ బహదూర్ కత్వాల్‌ను 12.443 ఓట్ల తేడాతో ఓడించారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). himalayanmirror.net. Archived from the original (PDF) on 2013-12-14. Retrieved 2021-07-07.
  2. Desk, The Hindu Net (2019-05-27). "Who is P.S. Golay, the new chief minister of Sikkim". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-07-07.
  3. GangtokMay 28, Press Trust of India; May 28, 2019UPDATED:; Ist, 2019 14:40. "New Sikkim Chief Minister PS Golay announced 5-day working week for government employees". India Today. Retrieved 2021-07-07. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)