సిజేరియన్ ఆపరేషన్

శస్త్రచికిత్సా విధానం, దీనిలో తల్లుల పొత్తికడుపులో కోత ద్వారా శిశువును మోసం చేస్తారు

సాధారణంగా శిశుజననం యోనిమార్గంద్వారా జరుగుతుంది. కొన్నిసార్లు జననమార్గంద్వారా ప్రసవం జరగడం కష్టమై, బిడ్డకూ, తల్లికీ అపాయం కలిగే సూచనలున్నప్పుడు పొత్తికడుపును కోసి ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీయడాన్నే' సిజేరియన్ ఆపరేషన్' (Caesarean section) అంటారు.

సిజేరియన్ శస్త్రచికిత్స
ఎలక్టివ్ సిజేరియన్
నొప్పులు మొదలవకముందే తగిన సమయం ఎంచుకుని చేస్తారు.
ఎమర్జన్సీ సిజేరియన్
నొప్పులు మొదలయిన తర్వాత, సహజంగా కాన్పు జరగనపుడు లేదా జరిగితే తల్లికి/బిడ్డకు హానిజరిగే అవకాశంవుంటే చేస్తారు.
సూచికలు (indications)
  • బిడ్డ గుండె వేగం- ఎక్కువ/తక్కువ ఉన్నపుడు
  • జననమార్గంకంటే శిశువు తల పెద్దదిగావుంటే
  • జననమార్గం ఇరుకుగా ఉండడంవలన ఇంతకుమునుపు సిజేరియన్ జరిగివున్నపుడు
  • కడుపులో బిడ్డ పొజిషన్ సరిగా లేనపుడు
  • తల్లికి అధిక రక్తపోటు/గుర్రపువాతం వచ్చినపుడు
  • ఉమ్మనీరు పోయి చాలాసేపయినా నొప్పులు రానపుడు
  • నొప్పులు రావడానికి చికిత్స ఫలించనపుడు
  • నొప్పులు వస్తున్నప్పటికీ గర్భసంచి సరిగ్గా విచ్చుకోనప్పుడు
  • మాయ/మావి (placenta) జననమార్గంలో అడ్డుగా వున్నపుడు
  • చాలా కాలం తర్వాత గర్భం వచ్చినపుడు
  • తల్లికి ఎయిడ్స్ వున్నపుడు
  • తల్లికి గుండెజబ్బు, మధుమేహం వున్నపుడు

మూలాలు

మార్చు