సిద్ధిపేట గొల్లభామ (చీరె)
గొల్లభామ చీర లేదా సిద్ధిపేట గొల్లభామ భారతదేశం లోని telangana చెందిన సిద్ధిపేట గ్రామంలో తయారవుతున్న చీరలు. మెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసే గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జీఐఏ జాబితాలో దీనికి 188వ సీరియల్ నెంబరును కేటాయిస్తూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.[1][2] ఈ కాటన్ చీరలలో పొదిగిన బొమ్మలు,ఆ చీరెలు పని మూలాంశాలకు ప్రసిద్ది చెందాయి.[3]
చరిత్ర
మార్చుఐదు దశాబ్దాల కిందట సిద్దిపేట, దుబ్బాక ప్రాంతంలో గొల్లభామ చీరె పురుడుపోసుకుంది...ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంత గొల్లభామ చీర అంటే మహిళలు మక్కువ చూపుతారు.కాటన్, మస్రెస్...రెండు దారాలతో నూ నేసే ఈ చీరెలకు ఎంతో విశిష్టత ఉంది...తలపై పాల కడువ పెట్టుకొని మహిళ వయ్యారంగా నడుస్తున్నట్లుగా ఉండే గొల్లభామ చిత్రాలను దారంతో మగ్గంద్వారా చీరెపై కార్మికులు నేసే తీరు అద్భుతం.దీన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రి గొల్లభామ చీరకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చింది.ఈమేరకు సిద్దిపేట చేనేత సంఘానికి పత్రాలను అందజేసింది.[4]
భౌగోళిక గుర్తింపు హక్కులు
మార్చుఈ చీరకు భౌగోళీక గుర్తింపు హక్కులు లభించాయి.
సంక్షోభం
మార్చునాలుగు దశాబ్దాల కిందట సిద్దిపేట, దుబ్బాకలో పదివేల మంది కార్మికులు ఉండగా. నేడు 650 మందికి సంఖ్య పడిపోయింది. అంటే అప్పటితో పోల్చితే 6.5 శాతం మాత్రమే. ఈ రంగం సంక్షోభం చూసి దాదాపు 15 ఏళ్లుగా కొత్తగా యువతరం ఈ వృత్తి చేపట్టడానికి ముందుకు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో నేత కుటుంబాల్లో చాలా మంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నా మగ్గం మాత్రం ఎక్కడం లేదు...ఇతర వృత్తుల వైపు మళ్లుతున్నారు. దీంతో ఈ కుల వృతి క్రమంగా అంతరించిపోయే దశకు చేరింది.
అంతర్జాతీయ గుర్తింపు
మార్చుమెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు నేసిన గొల్లభామల చీరకు జియోగ్రాఫీ ఇండికేషన్ అప్లికేషన్(జీఐఏ) గుర్తింపు లభించింది. ఈ జీఐఏ జాబితా వరుస సంఖ్య 188గా నిలవడంతో ఈ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1940లో సిద్దిపేటకు చెందిన రచ్చ రాందాస్, కాంటసాయిలు కలిసి మొదట ఈ చీరను తయారు చేశారు.[5]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-21. Retrieved 2016-01-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-16. Retrieved 2016-01-26.
- ↑ http://www.thehindu.com/news/cities/Vijayawada/article2626564.ece
- ↑ అంతరించి పోతున్న చేనేతచే
- ↑ ఆగస్టు 2012 జాతీయం