సిప్రా గుప్తా - ముఖర్జీ

సిప్రా గుప్తా సర్ జగదీశ్ చంద్రబోస్ పరిశోధనలతో ప్రభావితమై బాటనీ (వృక్షశాస్త్రం) మీద ఆసక్తి పెంచుకున్నది. అనతకు ముందు ఆమె వృక్షాలు జడపదార్ధాలన్న అభిప్రాయంతో ఉండేది. జగదీశ్ చంద్రబోస్ పరిశోధనల గురించి తెలుసుకున్న తరువాత చెట్లకు ప్రాణముందని జంతువలవలే అవి స్పందిస్తాయని. మిగిలిన జంతువులలాగా వాటికి కూడా జీవప్రక్రియ ఉంటుందని తెలుకున్న తరువాత ఆమెకు జగదోశ చంద్రబోసంటే ఆరాధన కలిగింది. 5-6 తరగతులు చదువుతున్న సమయంలోనే ఆమె చెట్ల హృదయం, మెదడు ఉండే స్థానాలను గుర్తించాలని, అవి ఎలా పనిచేస్తాయో, బయటి ప్రపంచం పరిణామాలకు అవి ఎలా స్పందిస్థాయో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. 9-10 తరగతులలో బాటనీగురించి వివరంగా తలుసుకున్నా మొక్కలు వెలుపలి వాతావరణణానికి ఎలాస్పందిస్తాయో మాత్రం అర్ధంకాలేదు. పాఠశాల చదువు పూర్తిచేసిన తరువాత నేను బి.ఎస్.సి (బాటినీ) హానర్స్ కోర్సులో చేరింది. ఉపాధ్యాయులు కలిగించిన ప్రేరణ ఆమెను వారిచ్చే ఉపన్యాసాలను అతిశ్రద్ధగా గమనించేలా చేసింది. బి.డి. Sanwal, H.Y. మోహన్ రామ్, S.C. మహేశ్వరీ, I.K. Vasil వంటి ఉపాధ్యాయులు అందించిన అద్భుతమైన ఉపన్యాసాలు

సిప్రా గుప్తా - ముఖర్జీ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఆమెకు ప్రేరణ కలిగించిన అధ్యాపకులలో " ఎబ్రియాలజిస్ట్ ప్రొఫెసర్ పి మహేశ్వరి " ప్రాధాన్యత అధికం. పలు అధ్యయన ఆవిష్కరణల ద్వారా పి.మహేశ్వరి అనేకమంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. అప్పుడు టిష్యూకల్చర్‌లో మొత్తం డిపార్ట్మెంట్ మొలకెత్తుతున్న దశలోనే ఉంది. అంతరాంతరాలలో ఉన్న ఆసక్తి మాత్రమే ఆమెను ముందుకు నడిపించింది. ఆమె రీసెర్చ్ అధ్యయనం డాక్టర్ బి.ఎం. జొహ్రి పర్యవేక్షణలో మొదలైంది. ఆమె రీసెర్చ్ ప్రధానాంశం " టిష్యూ కల్చర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ అలియం సెప " . డాక్టరేట్ పొందిన తరువాత నేను మహేశ్వరి ఉన్న డిపార్ట్మెంటులో ఉద్యోగిగ చేరాను. ఈ అవకాశామ్ని ఆమె ఒక మహత్తరకానుకగా ఆమె భావించింది. ఆమె మొక్కలలో ఉన్న వ్యత్యాసం జీవరసాయన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. ఆమెకు సరైన సమయంలో సరైన స్థానంలో స్వతంత్రంగా పనిచేయగలీన అవకాశం లభించడం ఆమె అభివృద్ధికి ఒక కారణమని ఆమె భావించింది.1999లో " ఏంథర్ కలచర్ " గురించి పరిశోధనా వ్యాసం వెలువడడం ఆమె వృత్తిజీవితంలో ప్రధాన మలుపుగా మారింది. ఆమె పోస్ట్ డాక్టరేట్ అధ్యయనం " రాబర్ట్ ఎస్. బందుర్స్కి " పర్యవేక్షణలో " మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ"లో సాగింది. తరువాత " ఎ.ఇ.సి ప్లాంట్ రీసెర్చ్ లాబరేటరీ"లో జె.వి వర్నర్ పర్యవేక్షణలో సాగింది. ఆమె " హెపాయిడ్ ప్రొడక్షన్ " గురించి వ్రాసిన వ్యాసాలు నేచుర్ పత్రికలో ప్రచిరితమయ్యాయి. 1971లో " ఇ.ఎం.బి.ఒ " సదస్సులో హెపాయిడ్ గురించి ఆమె పరిశోధనలు సమర్పించడానికి ఆమెకు ఐరోపా నుండి ఆహ్వానం వచ్చింది. హెపాయిడ్ గురించిన తరువాత గల్ఫ్, కెనడా సమావేశాలలో ఆమె పరిశోధనలు సమర్పిండానికి అవకాశం లభించుంది. 1983లో ఢిల్లీలో జరిగిన " ఎక్స్.వి ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ జెనెటిక్స్ " సమావేశంలో ఆమెకు చైనాకు చెందిన " ఇంస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అకాడమియా సినిక" డైరెక్టర్ ప్రొఫెసర్ " హ్యూ హన్"ను కలుసుకుని ఆయన ప్రశంశలు అందుకునే అవకాశం లభించింది.

అంతేకాక ఆయన వ్యవసాయ ఆదాయంలో వచ్చిన మాత్పులగురించి ప్రద్తావించారు. ఆయన సిప్రాగుప్తాను1984 చైనాలో జరగనున్న " జెనెటిక్ మనిప్యులేసన్ ఇన్ క్రాప్స్ " అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానించాడు. ఇది హెపాయిడ్ గురించి మాట్లాడడానికి సిప్రా గుప్తా పాల్గొన్న 3వ అంతర్జాతీయ సమావేశం. ఈ సందర్భం తనజీవితంలో మరపురాని సంఘటన అని సిప్రాగుప్తా తనకథనాలలో తెలిపింది. 1972లో " వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం" సమయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కొత్తగా స్థాపించబడిన " స్కూల్ ఆఫ్ లైఫ్ సైంసెస్ " విభాగంలో టీచర్‌గా పనిచేయడానికి ఆహ్వానం అందుకున్నది. ఆమె సంతోషంగా జె.ఎన్.యు ఆహ్వానం అందుకున్నది. అక్కడ ఆమె సర్వస్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం లభించింది. తరువాత ఆమె రీసెర్చ్ కొబసాగించడానికి " యు.జి.సి సి.ఎస్.ఐ.ఆర్, డి.బి.టి నుండి చాలినంత ఉపకారావేతనాన్ని అందుకున్నది. యు.ఎస్ కు బదులుగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ అధ్యయనం చేయడం ఆమె వృత్తిజీవితంలో విశేషప్రభావం చూపింది. ఆమె టీచిచర్‌గా పనిచేయడానికి అంగీకరించడం బంధువులు, స్నేహితులకు అలాగే పి.మహేశ్వరి, బి.ఎం జోహ్రీల మొదలైన వారికి ఆగ్రహం తెప్పించింది. ఒక స్త్రీ శాస్త్రఙరాలి అర్హతకు ఇది తక్కువగానూ స్త్రీల అణిచివేతకు ఇది తార్కాణంగానూ వారు భావించడమే ఆగ్రహానికి కారణం. యు.ఎస్‌ వంటి అభివృద్ధిచెందిన దేశాలలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుందని, సంఘనీతికి ఎదురీత చేయాలని, అత్యధికులైన పురుష శాస్త్రఙల మద్య స్త్రీ శాస్త్రఞరాలిగా నిలదొక్కుకోవడానికి ప్రయాస పడాలని ఆమె అభిప్రాయపడింది. అయినప్పటికీ ఆమె సీనియర్లు ఆమె ఉన్నతికి ఎంతో సహకరించారని. అలాంటి వారి సహాయం లభించకుంటే స్త్రీశాస్త్రఙలు రూపుదిద్దుకోవడం కష్టమని కూడా ఆమె అభిప్రాయపడింది. ఆమెకు ప్రోత్సాహం అందించినవారిలో డాక్టర్ ఎం.ఎస్.స్వామినాధన్ అందించిన ప్రోత్సాహం ఆమె తన లక్ష్యం చేరడానికి సహకరించింది. ఆమె తనకు మార్గదర్శకం వహించిన వారిలో స్త్రీశాస్త్రఙలు లేరని ప్రుషుల నిర్లక్ష్యానికి గురి కావడమే అందుకు కారణమని. అతిగొప్ప స్త్రీశాస్త్రఙరాలైన మేడం క్యూరీ, రోసలిండ్ వంటి వారు ఉన్నా వారికి తనకు మద్య ఉన్న దూరం అధికమని భావప్రకటన చేసింది.

ఆరోజులలో సైన్సు‌లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన శాస్త్రఙరాలిని భారతదేశంలో చూడలేదని. ఈవిషయమై సహోపాద్యాయులతో జరిపిన చర్చలలో స్త్రీలు పురుషులతో సమానమైన మేధాశక్తి ఉన్నావారైన సాంఘిక బాధ్యతల కారణంగా వారు వెనుకపడుతున్నారని అభిప్రాయాలు వినవచ్చాయి. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల మద్య ఆమె సాధించిన ప్రగతి ఆమెకు సంతృప్తిని కలిగించింది. తనసహ శాస్త్రఙలు, అడిమినిస్ట్రేటర్లు, వైస్ చాంసలర్ల మానసిక పరిస్థితిని పరిశీలిస్తూ వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ తడిలేని గరుకైన ఈకలను మెత్తపరచడానికి ప్రయత్నించినట్లు విలువైన సమయాన్ని వ్యక్తపరచినందుకు ఆమె విచారం వ్యక్తపరచింది. రాబోయే స్త్రీశాస్త్రఙలు ఇలా పరిస్థితులను బాగుపరఛాడానికి తమ విలువైన కాలాన్ని వ్యర్ధం చేయకూడదని కూడా ఆమె కోరుకున్నది.

మూలాలు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.

వెలుపలి లింకులు మార్చు